రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో మొక్కలు నాటే కార్యక్రమాలు సాగుతున్నాయని కేటీఆర్ అన్నారు. హరిత తెలంగాణ కావాలన్నదే లక్ష్యంగా... హరితహారం చేపట్టినట్లు తెలిపారు. సభాపతి పోచారం శ్రీనివాస్‌తో కలిసి మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొక్కలు నాటారు.
స్పేస్‌పార్క్ శంకుస్థాపన
33 శాతం అటవీ విస్తీర్ణమే లక్ష్యంగా... హరితహారం కార్యక్రమంలో భాగంగా కృషి చేస్తున్నామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల పాలనలో నిర్లక్ష్యానికి గురైన అడవులను పునరుద్ధరిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. సభాపతి పోచారం శ్రీనివాస్‌తో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో మొక్కలు నాటారు. మానేరు వాగు వద్ద మెగా ప్లాంటేషన్‌లో పాల్గొన్నారు. వెంకటాపూర్‌లో స్పేస్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు.
నీటితో కళకళ
వచ్చే ఏడాది నాటికి ఆవునూరు ప్రాంతమంతా నీళ్లతో కళకళలాడేలా చేస్తామని కేటీఆర్ తెలిపారు. మానేరుపై 11 చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నామని తెలిపారు. సజీవ జలదృశ్యం సాక్షాత్కారమయ్యేలా కృషి చేస్తున్నామన్నారు. రైతన్నకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్కారు అన్ని చర్యలు చేపడుతోందని వెల్లడించారు. నర్మాల నుంచి మానేరు వాగు నీటితో కళకళలాడుతుందన్నారు.
ఏ పథకం ఆగలేదు
కరోనాతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. అయినా సంక్షోభంలోనూ ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగలేదన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులకు రైతుబంధు అందజేసినట్లు తెలిపారు. వ్యవసాయాన్ని పండుగలా చేయాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కోనుగోలు చేసినట్లు చెప్పారు. తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా మారిందని ఎఫ్‌సీఐ సైతం ప్రశంసించిందన్నారు.
దేశానికి ఆదర్శంగా హరితహారం కార్యక్రమం నిలుస్తోందని మంత్రి కేటీఆర్, సభాపతి పోచారం కొనియాడారు. సిరిసిల్ల జిల్లాలో 14 వందల హెక్టార్లలో పరిహారం కింద అడవులు పెంచనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:వారికి స్మార్ట్ఫోన్లే లేవ్- మరి ఆన్లైన్లో చదువెలా?