ఈ ఏడాది కార్యాలయ స్థల వినియోగం విషయంలో బెంగళూరును హైదరాబాద్ దాటేస్తుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ జేఎల్‌ఎల్‌కు చెందిన హైదరాబాద్ కార్యాలయన్ని ఆయన ప్రారభించారు. దేశంలో ఐటీ స్థలం వినియోగంలో హైదరాబాద్ వాటా 27 శాతమని తెలిపారు. నగరంలో ఖాళీగా ఉన్న ఆఫీసు స్థలం 18 శాతం నుంచి 3.6 శాతానికి పడిపోయిందని, దీన్ని బట్టి స్థిరాస్తి రంగానికి మంచి అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు. మైండ్‌స్పేస్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం నగరం పశ్చిమ ప్రాంతంలోనే పెట్టుబడులు కేంద్రీకృతం అవుతున్నాయని మిగతా ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టే వారికి ప్రోత్సహాకాలు అందిస్తూ ప్రభుత్వం లుక్ ఈస్ పాలసీ(లీప్)ను తీసుకొచ్చిందని తెలిపారు.
ఇదీ చూడండి :రాఖీల యందు ఈ రాఖీలు వేరయా...