KTR speech at T innovation Summit 2023 : నాస్కామ్ లెక్కల ప్రకారం గత ఏడాదిలో దేశంలో ఉపాధి కల్పనలో 30 శాతం ఉద్యోగాలు తెలంగాణ నుంచే ఉన్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గత పదేళ్లలో హైదరాబాద్‌ను దేశంలోనే లీడింగ్ ఇన్నోవేషన్ నెట్వర్క్‌గా తీర్చిదిద్దినందుకు ఎంతో గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. టీ హబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరిగిన టీ ఇన్నోవేషన్-2023 సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
T Innovation Summit 2023 : ఈ సందర్భంగా మాట్లాడిన ఐటీ మంత్రి కేటీఆర్... గత పదేళ్లల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిలో ఆవిష్కరణలకు ముఖ్యపాత్ర ఉందని ఆయన గుర్తు చేశారు. ఆలోచన లేనిదే ఆవిష్కరణ లేదని అభిప్రాయపడిన మంత్రి... ఇంవేటర్స్, స్టేక్ హోల్డర్స్, వ్యవస్థాపకులు, ఎకాడమీష్యన్స్ అంతా కలిసి నేటి హైదరాబాద్ స్టార్టప్ ప్రపంచాన్ని నిర్మించడంలో చేతులు కలిపారని కొనియాడారు. మ్యాక్, సైన్స్ అండ్ ఆర్ట్స్ ఇలా అన్ని రంగాల్లోనూ ఆవిష్కరణలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. కేవలం ఐటీ ఉత్పత్తుల్లో మాత్రమే కాకుండా అగ్రికల్చర్ ఉత్పత్తుల్లో కూడా తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల ప్రతినిధులతో పాటు మంత్రి మల్లారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
"ఆలోచన లేనిదే ఆవిష్కరణ లేదు. గత పదేళ్లలో ఇండియాలో లీడింగ్ ఇన్నోవేషన్ నెట్వర్క్‌ను నిర్మించినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇంవేటర్స్, స్టేక్ హోల్డర్స్, వ్యవస్థాపకులు, ఎకడమీష్యన్స్ అంతా కలిసి నేటి హైదరాబాద్ స్టార్ట్ అప్ ప్రపంచాన్ని నిర్మించారు. నాస్కామ్ లెక్కల ప్రకారం గత ఏడాదిలో దేశంలో ఉపాధి కల్పనలో 30 శాతం ఉద్యోగాలు తెలంగాణ నుంచే ఉన్నాయి. తెలంగాణ కేవలం ఐటీ ఉత్పత్తుల్లోనే కాదు.. అగ్రికల్చరల్ ఉత్పత్తుల్లో కూడా ముందంజలో ఉంది."- కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి
రాష్ట్రంలో అంకురాలకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా టీహబ్ (T-Hub), వీహబ్(V-Hub), డేటా సెంటర్, టీవర్క్స్ వంటి వినూత్న ఇంక్యుబేటర్లను ఏర్పరిచిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ టీహబ్‌ను భారత సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ దేశంలో అత్యుత్తమ టెక్నాలజీ ఇంక్యుబేటర్‌గా గుర్తించింది. నేషనల్ టెక్నాలజీ అవార్డ్ 2023లో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ అవార్డును కూడా టీ హబ్ గెలుచుకుంది. టీ హబ్ గురించి గతంలో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. టీ హబ్‌ను చూస్తే తెలంగాణ ప్రభుత్వ ముందు చూపు తెలుస్తుందన్నారు.
ఇవీ చదవండి: