ETV Bharat / state

పురపాలిక ఎన్నికలపై నేడు కేటీఆర్​ సమీక్ష - trs

తెలంగాణ రాష్ట్ర సమితి పురపాలిక ఎన్నికలపై దృష్టి సారించింది. పట్టణ ప్రాంతాల్లో పార్టీకి భిన్న పరిస్థితులు ఉండడం వల్ల ఈ ఎన్నికలపై పార్టీ అధిష్ఠానం వ్యూహాలు రూపొందిస్తోంది. వార్డులు, డివిజన్ల వారీగా కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ సభ్యత్వ నమోదు, పురపాలక ఎన్నికలపై నేడు సమీక్ష నిర్వహించనున్నారు.

కేటీఆర్​
author img

By

Published : Jul 22, 2019, 6:09 AM IST

Updated : Jul 22, 2019, 7:32 AM IST

పురపాలిక ఎన్నికలపై నేడు కేటీఆర్​ సమీక్ష

పురపాలిక ఎన్నికల కోసం తెరాస ప్రత్యేక వ్యూహాన్ని రూపొందిస్తోంది. పోలింగ్​ బూత్​ల వారీగా కమిటీలు, వార్డుల, డివిజన్ల వారీగా ప్రత్యేక బృందాల ఏర్పాటు చేయాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. తెరాస సభ్యత్వ నమోదు శనివారంతో పూర్తి కావడం వల్ల పురపాలక ఎన్నికలపై దృష్టి సారించింది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ సభ్యత్వ నమోదు, పురపాలక ఎన్నికలపై పార్టీ నేతలతో నేడు సమీక్ష నిర్వహించనున్నారు.

బూత్​ కమిటీలు

మున్సిపల్​ ఎన్నికలను తెరాస అత్యంత కీలకంగా భావిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో పార్టీకి కొంత భిన్నమైన పరిస్థితులు ఉన్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని యోచిస్తోంది. నగరాల్లో విజయం సాధించి పట్టు నిరూపించుకోవాలని చూస్తోంది. ఆ దిశగా బూత్​ కమిటీలు ఏర్పాటు చేయబోతుంది. బూత్​ కమిటీలతో సానుకూల ఫలితాలు వస్తాయని తెరాస అధిష్ఠానం బలంగా నమ్ముతోంది. ఇంటింటి ప్రచారం.. ఓటర్ల సమీకరణ ద్వారా శాసనసభ, స్థానిక ఎన్నికల్లో ఘన విజయాలకు కమిటీలు కీలకంగా వ్యహరించాయని భావిస్తోంది.

ముగిసిన సభ్యత్వ నమోదు

సభ్యత్వ నమోదు శనివారంతో ముగిసింది. గత నెల 27న ప్రారంభమై ఈ కార్యక్రమం విజయవంతంగా సాగినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రతీ నియోజకవర్గానికి 50 వేల నుంచి లక్ష వరకు సభ్యత్వ లక్ష్యాన్ని నిర్దేశించారు. కీలక నియోజకవర్గాల్లో పార్టీ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. మిగిలిన నియోజకవర్గాల సమాచారం రావాల్సి ఉంది.

ఇవీ చూడండి: మబ్బు విడిచిన వరుణుడు... విస్తారంగా జల్లులు

Intro:Body:Conclusion:
Last Updated : Jul 22, 2019, 7:32 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.