కొత్త రోడ్ల నిర్మాణం:
నగర రోడ్డు నెట్ వర్క్‌ను బలోపేతం చేసేందుకు అవసరమైన రైల్వే వంతెనలు గుర్తించి రైల్వే శాఖ నుంచి అనుమతులు పొందే ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. స్లిప్ రోడ్లతోపాటు, మిస్సింగ్ లింక్‌లను కలిపే చిన్న రోడ్ల పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనితోపాటు ఎస్సార్డీపీ పనులకు అదనంగా అవసరమైన చోట్ల జంక్షన్ల అభివృద్దిపైన కూడా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు నూతన రోడ్లను ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ నిర్మిస్తుందని, సాధ్యమైనన్ని ఎక్కువ స్లిప్ రోడ్లకు ప్రణాళిక సిద్ధం చేస్తుందని మంత్రి తెలిపారు. బోరబండ నుంచి మియాపూర్ వరకు ఉన్న మెయిన్ రోడ్డు నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్ దిశగా స్లిప్ రోడ్లు ఏర్పాటుచేసేందుకు గల అవకాశాలు పరిశీలిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
తక్కువ ఖర్చుతో:
అలాగే జూబ్లీహిల్స్ నుంచి నాలెడ్జ్ సిటీ వైపు, ఒల్డ్ ముంబై హైవే వరకు స్లిప్ రోడ్లు నూతన రోడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కోకాపేట, కొల్లూర్, తెల్లాపూర్ వరకు బాహ్య వలయ రహదారిని కలుపుతూ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రణాళికలో ఉన్న అర్టిలరీ రోడ్లకు అదనంగా నూతన రోడ్ల ఏర్పాటుకు రూపకల్పన చేస్తుంది. తక్కువ ఖర్చుతో బహుళ ప్రయోజనాలు కలిగే రీతిలో మిస్సింగ్ రోడ్ల వివరాలు పురపాలక శాఖకు తెలపాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ కోరారు. నగరం చుట్టుపక్కల స్థానిక స్థిరాస్తి వ్యాపార సంస్థల యాజమాన్యాల నుంచి కూడా సలహాలు స్వీకరిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : సీఎల్పీ నేత భట్టి సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్