ETV Bharat / state

KTR Review On Rains : 'ప్రాణ నష్టం జరగకుండా చూడటమే ప్రధాన లక్ష్యం' - వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన కేటీఆర్​

KTR Visit Hyderabad Flood Areas : రాష్ట్రంతో పాటు హైదరాబాద్​లోని భారీ వర్షాలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవడమే.. తమ ముందున్న ప్రాథమిక అంశమని అధికారులకు సూచించారు. అనంతరం హైదరాబాద్​లోని వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించారు.

ktr
ktr
author img

By

Published : Jul 27, 2023, 6:16 PM IST

KTR Review On Rain In Hyderabad : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా ప్రాణనష్టం జరగకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్​ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పురపాలక శాఖ అధికారులతో కూడా సీఎం ప్రత్యేకంగా మాట్లాడారని మంత్రి వివరించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పట్టణాల్లో ఉన్న పరిస్థితులపైనా సమీక్షించిన కేటీఆర్.. హైదరాబాద్‌ నుంచి పురపాలక అధికారులు అడిషనల్‌ కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

మొదటగా హుస్సేన్‌సాగర్‌ వద్ద వరద ఉద్ధృతిని పరిశీలించిన మంత్రి కేటీఆర్​.. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపైన అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. శిథిల భవనాలలో నివసిస్తున్న ప్రజలను వెంటనే అక్కడి నుంచి తరలించాలని ఆదేశించారు. పురపాలక ఉద్యోగుల అన్ని సెలవును రద్దు చేశామని.. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫోన్లు, ఇతర మాధ్యమాల ద్వారా సమీక్షిస్తున్నామని తెలిపారు. ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి వర్షం కురవడం ద్వారా ప్రజలకు కొంత ఇబ్బంది ఎదురవుతుందన్నారు. తమ ప్రధాన లక్ష్యం ప్రాణనష్టం జరగకుండా చూడడమేనని స్పష్టం చేశారు.

ఈ సమయంలో ప్రతిపక్షాలు రాజకీయాలేంటి : ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మాని భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని హితవు పలికారు. భారీ వర్షాల్లో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా చిల్లర విమర్శలు చేయవద్దని అన్నారు. మూసీ వరదను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. వరంగల్‌ నగరానికి వెళ్లాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించామని.. అవసరమైతే తాను కూడా శుక్రవారం స్వయంగా వెళ్లనున్నట్లు చెప్పారు.

KTR Inspected Musi Canal At Musarambagh Bridge : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మూసీ నదిలో భారీ నీటి ప్రవాహం కొనసాగుతోంది. మూసారాంబాగ్​ వంతెన వద్ద నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు అక్కడ ఏ మాత్రం ప్రవాహం పెరిగిన.. వంతెన మీద నుంచి రాకపోకలను నిలిపివేయనున్నట్లు ట్రాఫిక్​ పోలీసు అధికారులు తెలిపారు. అయితే వంతెన వద్ద నీటి ప్రవాహన్ని మంత్రి కేటీఆర్​ పరిశీలించారు. తాజా పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకొని.. చాదర్​ఘాట్​ వంతెన వద్ద నీటి ప్రవాహాన్ని కూడా కేటీఆర్​ అధికారులతో కలిసి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు జీహెచ్​ఎంసీ సిబ్బంది అప్రమత్తం చేయాలని సూచించారు. భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బీఆర్​ఎస్​ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని మంత్రి కేటీఆర్​ పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.