KTR Review: రాబోయే వర్షాకాలంలో హైదరాబాద్ సహా చుట్టుపక్కల మున్సిపాలిటీల్లోని... లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా.... చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వర్షాకాలం విపత్తుల నివారణకు ముందస్తు ప్రణాళికపై అధికారులతో కేటీఆర్ సమీక్షించారు. వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం ఎస్ఎన్డీపీ పనులు.... వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని అధికారులకు నిర్దేశించారు.
ఎస్ఎన్డీపీ కింద రూ. 858 కోట్లతో చేపట్టిన 60 పనుల్లో.. జీహెచ్ఎంసీ పరిధిలో 37 పనులు ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. ఎస్ఎన్డీపీ ప్రణాళికలో లేని నాలాలను కూడా గుర్తించి... వరద నివారణ పనులు పూర్తి చేయాలని సూచించారు. నగరంలో బలహీనంగా ఉన్న చెరువుకట్టలకు మరమ్మత్తు చేయాలని కేటీఆర్ ఆదేశించారు. సమావేశంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, మేయర్ విజయ లక్ష్మి, కమిషనర్ లోకేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: