ETV Bharat / state

అప్పుడు టీఎస్‌ ఐపాస్‌... ఇప్పుడు టీఎస్‌ బీపాస్‌

author img

By

Published : May 14, 2020, 4:33 PM IST

టీఎస్‌ ఐపాస్‌ వలే అనుమతులను సులభతరం చేసేందుకు టీఎస్‌-బీపాస్‌ అమలుకు సిద్ధం కావాలని మంత్రి కేటీఆర్​ పురపాలక, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులతో సమీక్ష జరిపారు. అందుకోసం సంబంధిత సిబ్బందికి శిక్షణ, అవగాహన కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు.

ktr review meeting ts ipass now TS Bpass will be implemented in telangana
అప్పుడు టీఎస్‌ ఐపాస్‌... ఇప్పుడు టీఎస్‌ బీపాస్‌

భవన నిర్మాణ అనుమతుల్లో పారదర్శకతే లక్ష్యంగా జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో టీఎస్ బీపాస్ విధానాన్ని అమలు చేయనున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ కార్యక్రమంపై పురపాలక, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రయోగాత్మకంగా 87 మున్సిపాల్టీల్లో ఈ విధానాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టామని, వచ్చిన దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందన్నారు. కొన్నింటికి ఇప్పటికే అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.

ప్రత్యేక కార్యాచరణ

సుమారు 1100 దరఖాస్తులు వచ్చాయని, సాఫ్ట్​వేర్ ఆధారిత వ్యవస్థకు సంబంధించి పక్షం రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు వివరించారు. మిగతా మున్సిపాల్టీలతోపాటు జీహెచ్ఎంసీలోనూ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని గ్రేటర్ అధికారులకు మంత్రి ప్రత్యేకంగా తెలిపారు. ఇందుకోసం ఒకటి రెండు రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగం, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఆన్​లైన్​లోనే అనుమతులు..

టీఎస్ బీపాస్ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక ప్రజలు ఆన్​లైన్​లోనే అనుమతులు పొందేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని కేటీఆర్ స్పష్టం చేశారు. మీసేవ, పౌర సేవా కేంద్రాలు, ఇంటర్నెట్, మొబైల్ యాప్ లేదా నేరుగా దరఖాస్తు చేసుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పౌరులు ఎవరైనా దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొంటే అధికారులను సంప్రదించేలా ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. అందుబాటులో ఉండే వ్యవస్థను తయారు చేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా సాఫ్ట్​వేర్​ను మరింత సులభతరం చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఇదీ చూడండి : నీటిని తరలిస్తే చూస్తూ ఊరుకోం: రేవంత్‌ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.