ETV Bharat / state

'మలేషియాలో రాష్ట్రవాసులను స్వస్థలాలకు తీసుకొస్తాం' - తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు

మలేషియాలో వీసా గడువు ముగిసి... ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర వాసులను స్వస్థలాలకు తీసుకవచ్చేలా చర్యలు తీసుకుంటామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ తెలిపారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూస్తానని అన్నారు. అయితే వీసా లేకుండా నివసిస్తున్న భారతీయులు డిసెంబరు 31 లోగా దేశం విడిచి వెళ్లాలని మలేషియా ప్రభుత్వం ఆదేశించింది.

కేటీఆర్​
author img

By

Published : Aug 27, 2019, 10:24 PM IST

'మలేషియాలో రాష్ట్రవాసులను స్వస్థలాలకు తీసుకొస్తాం'

మలేషియాలో వీసా గడువు ముగిసిన తెలంగాణ వాసులు స్వస్థలాలకు చేరేలా చొరవ తీసుకుంటానని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ హామీ ఇచ్చారు. దాదాపు 2 వేల మంది రాష్ట్రవాసులు అక్కడ చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారని... తెరాస ఎన్​ఆర్​ఐ విభాగం కో ఆర్డినేటర్​ మహేశ్​ బిగాల కేటీఆర్​ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కేటీఆర్​ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరఫున ప్రత్యేక బృందం ద్వారా వారిని రాష్ట్రానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

డిసెంబరు 31 గడువు

వీసా లేకుండా నివసిస్తున్న భారతీయులు డిసెంబరు 31 లోగా దేశం విడిచి వెళ్లాలని మలేషియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే జరిమానా కట్టడం సహా భారత్​ వెళ్లేందుకు విమాన టికెట్​ చూపించాలని షరతు విధించింది. దీనికి సుమారు రూ.20 వేలు ఖర్చు అవుతుందని తెరాస ఎన్​ఆర్​ఐ విభాగం కో ఆర్డినేటర్​ మహేశ్​ బిగాల కేటీఆర్​ దృష్టికి తెచ్చి... ప్రభుత్వం తరఫున తగిన సహాయం చేయాలని కోరారు. ఇందుకు కేటీఆర్​ సానుకూలంగా స్పందించారు. గతేడాది దుబాయ్ నుంచి సుమారు 600 మందిని ప్రభుత్వం సురక్షితంగా తీసుకువచ్చిందని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇదీ చూడండి : రైతుల పొలాలు పచ్చగా.. కాంగ్రెస్​ నేతల కళ్లు ఎర్రగా..

Date : 23-08-2019 TG_Hyd_57_23_Traffic Police Awareness At Tankbund_Av_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam యాంకర్ : ట్రాఫిక్ నియమ నిబంధనలను సక్రమంగా పాటిస్తున్న వాహనదారులకు హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు అభినందించారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించడంతో పాటు ఒక్క చాలన్ కూడ లేని వాహనదారులకు పూలు , సినిమా టికెట్లను ఉచితంగా ఇచ్చి ప్రోత్సహించారు. ట్రాఫిక్ పోలీసులు వేసే చలాన్ల కు భయపడి ట్రాఫిక్ రూల్స్ పాటించకూడదని...తమ రక్షణ కోసం రూల్స్ పాటించాలని ట్రాఫిక్ ఏసీపీ వాహనదారులకు సూచించారు. మీలాగే ఇతరులు కూడా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా ఉండేలా ప్రచారం చేయాలని వారిని విజ్ఞప్తి చేశారు. విజువల్స్....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.