KTR Released Book on Telangana Development : తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ పుస్తకావిష్కరణ చేశారు. ప్రగతి ప్రస్థానం - ఎట్లుండే తెలంగాణ ఎట్లైంది పేరిట పుస్తకాన్ని విడుదల చేశారు. బీఆర్ఎస్ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయన్న ఆయన.. అవి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించాయని చెప్పారు. వచ్చే (Telangana Elections) ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్ (KCR) హ్యాట్రిక్ సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. వృథా నీటి పునర్వినియోగం కోసం నూతన విధానాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ బీ అలర్ట్ - కాంగ్రెస్ డీప్‌ఫేక్‌ను తిప్పికొట్టండి : కేటీఆర్
ప్రజలకు సంబంధం లేని అంశాలపై విపక్షాలు మాట్లాడుతున్నాయని.. తమకు తెలంగాణపై అహంకారం కాదు.. మమకారం ఉందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో గెలవగానే ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఉండేలా కృషి చేస్తామన్నారు. మధ్య తరగతి ప్రజలు ఇంటి రుణం తీసుకుంటే.. ప్రభుత్వమే వడ్డీ చెల్లించే యోచనలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత కోసం కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో లంచం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్లు చేసుకునే పరిస్థితి ఉండేదా అని ప్రశ్నించారు. ధరణి రాక ముందు 8 మంది అధికారులు భూ యాజమాన్య హక్కులు మార్చే అవకాశం ఉండేదని.. ప్రస్తుతం యజమాని బొటన వేలు పెడితే మాత్రమే యాజమాన్య హక్కులు మారతాయని కేటీఆర్ అన్నారు.
అసైన్డ్ భూములు ఉన్న వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తాం : కేటీఆర్
KTR Releases Book on Telangana Agitation : ధరణిలో చిన్నచిన్న లోపాలు ఉన్నాయి.. వాటిని సరిచేస్తామని తెలిపారు. స్థిరమైన ప్రభుత్వం.. సరైన నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బెంగళూరును తలదన్నే నగరంగా హైదరాబాద్ మారిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే ముందు చాలా మందికి అనుమానాలు ఉండేవని.. రాష్ట్రం వస్తే హైదరాబాద్, స్థిరాస్తి వ్యాపారం ఎలా ఉండేదో అనుమానాలు ఉండేవని తెలిపారు. తెలంగాణ వచ్చి తొమ్మిదిన్నరేళ్లు అయ్యిందన్న ఆయన తొమ్మిదిన్నరేళ్లలో కొవిడ్, ఎన్నికల వల్ల ఆరున్నరేళ్లు మాత్రమే నికరంగా పరిపాలించామని వివరించారు.
కాంగ్రెస్ 11 సార్లు అధికారంలో ఉన్నా ఏం అభివృద్ధి చేసింది : కేటీఆర్
ఆరున్నరేళ్లలో తాము చేసిన అభివృద్ధి ప్రజల ముందు ఉందని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో ప్రో హైదరాబాద్ ఇమేజ్, ప్రో ఐటీ, ప్రో అర్బన్ ఉండేదని తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో 14వ స్థానంలో ఉందని.. ప్రస్తుతం పంజాబ్‌ను వెనక్కినెట్టి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో ప్రథమస్థానంలో ఉన్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పునరంకితం అవుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పార్టీనే ప్రజలు గెలిపిస్తారు : గంగుల కమలాకర్
'కోహ్లీ ఎలా అయితే సెంచరీ చేస్తాడో, అలానే కేసీఆర్ కూడా వంద సీట్లతో గెలుస్తారు'