KTR on Telangana Debts 2023 2023 : వృద్ధిరేటులో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేసిందని అన్నారు. కొంత మంది నాయకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న ఆరోపణలు సరికావని బదులిచ్చారు. హైదరాబాద్‌లో మీట్ ది ప్రెస్‌లో కేటీఆర్ మాట్లాడారు. ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించిందని కొనియాడారు. ఐటీ, పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్లు పెరిగాయని హర్షం వ్యక్తం చేశారు.
KTR on Telangana Loans 2023 : ప్రతి ఏడాది 3.5 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో 26 వేల మెగావాట్ల సామర్థ్యానికి చేరుకున్నామని స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం రుణాలు తెచ్చామని అన్నారు. సంపద సృష్టించడం కోసమే రుణాలు తీసుకువచ్చామని తెలిపారు. అప్పుల మొత్తం సాగునీటి రంగం, మిషన్ భగీరథకు వినియోగించామని పేర్కొన్నారు. దీనివల్ల ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. రాష్ట్రం నుంచి రూ.2.41 లక్షల కోట్ల ఎగుమతులు అవుతున్నాయని తెలియజేశారు. ఐటీ, ఫార్మా, ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు.
KTR Respond on Medigadda Project : మేడిగడ్డ బ్యారేజ్ కుంగుపాటుపై మంత్రి కేటీఆర్ స్పందించారు. 'మేడిగడ్డ ప్రాజెక్టు కట్టి ఐదేళ్లు పూర్తయ్యింది. ప్రజలకు సంబంధించి ఒక్కపైసా వృథా కాదు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రజలపై ఎలాంటి భారం పడదు. ఒక్కపైసా భారం పడకుండా ఏజెన్సీనే పూర్తి చేస్తుంది. 28 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకుని బ్యారేజ్ నిలబడింది. ఇటీవల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బ్యారేజ్ పరిశీలించింది. కాళేశ్వరం చివరి ఆయక్టటుకు నీళ్లు అందుతున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీల విమర్శలు సరికాదు 'అని అన్నారు.
KTR on Jobs in Telangana : దేశవ్యాప్తంగా ఏడాదిలో 4.5 లక్షల ఉపాధి కల్పన జరిగిందని.. హైదరాబాద్ నుంచే 1.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. దేశంలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్ నుంచే వచ్చాయని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2.2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టామని వివరించారు. దీంతో పాటు 1.32 లక్షల ఉద్యోగాల భర్తీ చేశామని అన్నారు. మరో 90 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని గుర్తు చేశారు.
"సోనియాగాంధీ బలిదేవత అని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఏపీలో ఎలాగూ కాంగ్రెస్ పార్టీ కుప్పకూలింది. తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్ ఆరాటం. రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పదేళ్లలో పది వేల ఉద్యోగాలు ఇచ్చింది. ఉమ్మడి ఏపీలో తెలంగాణలో ఏడాదికి వెయ్యి ఉద్యోగాల చొప్పున ఇచ్చారు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ప్రత్యేక రాష్ట్రం రాకముందు ఐదు వైద్య కళాశాలలు ఉండేవి. కేంద్రంలో బీజేపీకు ప్రజలు పదేళ్లు అవకాశం ఇచ్చారు. ఏళ్ల తరబడి అవకాశం ఇచ్చినా అభివృద్ధి చేసిందేమీ లేదు. అభివృద్ధి ఆధారంగా మేము ఓట్లు అడుగుతున్నాం. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ హామీ ఏమైంది?. ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామన్న హామీ ఏమైంది?" - కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి
KTR Comments on Karnataka Government : కర్ణాటకను మోడల్‌గా కాంగ్రెస్ నేతలు చూపుతున్నారని.. ఆ రాష్ట్ర రైతులే తెలంగాణకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటక వెళ్లి రైతుల పరిస్థితిపై ఆరా తీసేందుకు సిద్ధమా అని కాంగ్రెస్(Congress) నాయకులను ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలకు సంపూర్ణ న్యాయం చేశామని అన్నారు. గతంలో మైగ్రేషన్‌కు పర్యాయపదంగా పాలమూరు ఉండేదని.. ఇవాళ ఇరిగేషన్‌కు పర్యాయపదంగా మార్చామని తెలిపారు. ప్రగతి నివేదికలు సమర్పించి ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.
KTR Comments on Congress Party : 'కాళేశ్వరం వల్లే.. 4 జిల్లాల్లో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తోంది'
KTR Comments on Congress Today : 'ఇంటింటికి తాగునీరు.. 24 గంటల విద్యుత్ ఆపేయమంటారేమో?'