ETV Bharat / state

KTR on Hyderabad Development : 'మానవ వనరులు, నైపుణ్యానికి రాజధాని హైదరాబాద్' - KTR inaugurate Mobis Bits Pilani Center Excellence

KTR Inaugurated Digital Hub : మానవ వనరులు, నైపుణ్యానికి హైదరాబాద్‌ రాజధాని అని కేటీఆర్‌ పేర్కొన్నారు. నగరంలో అభివృద్ధి విప్లవంలా సాగుతోందని చెప్పారు. ప్రతి 2 ఐటీ ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్‌లోనే వస్తోందని కేటీఆర్ వెల్లడించారు.

Ktr
Ktr
author img

By

Published : Jul 5, 2023, 12:56 PM IST

KTR Launches Stellantis Digital Hub office : ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ సహా అన్ని రంగాల అభివృద్ధితో.. దేశంలోనే తెలంగాణ కాంతిపుంజంలా దూసుకెళ్తోందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఒకే రోజు పలు సంస్థల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఆయన.. మానవ వనరులు, నైపుణ్యానికి నగరం రాజధానిగా మారిందని చెప్పారు. నానక్‌రాంగూడాలో స్టెల్లాంటిస్ సంస్థ డిజిటల్ హబ్ కార్యాలాయాన్ని ప్రారంభించిన మంత్రి.. తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో భాగస్వామ్యం కావడం పట్ల అభినందనలు తెలిపారు. ఆటోమొబైల్ ఇపుడు నాలుగు చక్రాలపై కంప్యూటర్​గా మారిపోయిందని చెప్పారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో ఎంతో నైపుణ్యం ఉందని.. నైపుణ్యాలను ఆకర్షిస్తుందని కేటీఆర్ వెల్లడించారు.

KTR Inaugurated Right software company : అనంతరం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో రైట్ సాఫ్ట్​వేర్ కంపెనీని కేటీఆర్‌ ప్రారంభించారు. హైదరాబాద్ నగరం మానవ వనరులు, నైపుణ్యానికి రాజధానిగా మారిందని కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి విప్లవంలా సాగుతోందని చెప్పారు. నగరంలో ఉన్న వృద్ధి భారతదేశంలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. దేశంలో ఐటీ రంగంలో వస్తున్న రెండు ఉద్యోగాల్లో.. హైదరాబాద్‌లోనే ఒకటి వస్తోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని కేటీఆర్ వివరించారు.

ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ హబ్​ల ఏర్పాటు : నగరాలు, పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లల్లో.. జీవితంపై కసి ఎక్కువగా ఉంటుందని కేటీఆర్ వివరించారు. వారు బెంగళూరు, హైదరాబాద్ నుంచి వచ్చిన వారితో పోలిస్తే.. ఆంగ్లం అంతగా రాకున్నప్పటికి పట్టుదల ఎక్కువని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ హబ్​లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమర్థ ప్రభుత్వం, పటిష్ఠ నాయకత్వం వల్లే పెట్టుబడులు వస్తున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. అనంతరం కేటీఆర్ టీహబ్‌లో ఏర్పాటు చేసిన మోబిస్-బిట్స్ పిలాని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్​ను ప్రారంభించారు.​

"హైదరాబాద్ నగరం మానవ వనరులు, నైపుణ్యానికి రాజధానిగా మారింది. అభివృద్ధి విప్లవంలా సాగుతోంది. హైదరాబాద్​లో ఉన్న వృద్ధి భారతదేశంలో ఎక్కడా లేదు. దేశంలో ఐటీ రంగంలో వస్తున్న రెండు ఉద్యోగాల్లో హైదరాబాద్​లోనే ఒకటి వస్తోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన యువతలో కసి ఎక్కువగా ఉంటుంది. అందుకే ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీ హబ్​లు ఏర్పాటు చేసి అక్కడి యువతను ప్రోత్సహిస్తున్నాం. సమర్థ ప్రభుత్వం, పటిష్ఠ నాయకత్వం వల్లే పెట్టుబడులు వస్తున్నాయి." - కేటీఆర్, ఐటీశాఖ మంత్రి

హైదరాబాద్‌లో అభివృద్ధి విప్లవంలా సాగుతోంది

ఇవీ చదవండి : LULU Group in Telangana : రాష్ట్రంలో లులూ గ్రూప్ రూ.3500 కోట్ల పెట్టుబడి.. కేటీఆర్ హర్షం

TCL invest in Telangana : తెలంగాణలో టీసీఎల్​ పెట్టుబడులు.. రూ. 225 కోట్లతో ఎలక్ట్రానిక్స్​ తయారీ ప్లాంట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.