ETV Bharat / state

'సంపద పెంచాలి- పేదలకు పంచాలనేదే కేసీఆర్ సిద్ధాంతం' - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

KTR on Hyderabad Development : రాష్ట్రంలో సంపద పెంచి.. పేదలకు పంచడమే కేసీఆర్​ సిద్ధాంతమని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో హైదరాబాద్​ విశ్వనగరంగా ఎదిగిందని పేర్కొన్నారు. ఈ అభివృద్ధిని కొనసాగించడానికి బీఆర్​ఎస్​కే ఓటు వేయ్యాలని.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Telangana Assembly Elections 2023
KTR on Hyderabad Development
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 3, 2023, 8:02 PM IST

KTR on Hyderabad Development : బీఆర్​ఎస్​ పాలనలో హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్(Minister KTR)​ పేర్కొన్నారు. తెలంగాణ భవన్​లో మంత్రి కేటీఆర్ సమక్షంలో.. ఖైరతాబాద్​ బీజేపీ నాయకుడు గోవర్ధన్​ బీఆర్​ఎస్​ పార్టీలో చేరారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న కేసీఆర్​ కిట్​, పిల్లలకు అల్పహార పథకం ఉచిత వైద్యం, రైతు బీమా వంటి పథకాలతో.. ప్రజలకు పుట్టుక నుంచి చావు వరకు సంక్షేమ పథకాలు అండగా ఉన్నాయన్నారు.

KTR Attended BRS Activists Meeting at Bikkanur : ఈ ఎన్నికల్లో దిల్లీ దొరలకు గల్లీ ప్రజలకు మధ్య పోరాటం అందుకే కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ

BRS Election Campaign 2023 : తొమ్మిదిన్నరేళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు.. నగర అభివృద్ధి ఏమయితది.? ఎట్లయితది.? అని చాలా మందికి అనుమానాలు ఉండేవని కేటీఆర్ తెలిపారు. కానీ నేడు హైదరాబాద్​ మహానగరం విశ్వనగరంగా మారిందని.. భాగ్యనగరంలో ఉంటే అమెరికాలో ఉన్నట్లు ఉందని సినీనటుడు రజినీకాంత్ అన్నారన్నారు. హైదరాబాద్‌లోనే ఇల్లు కొనుక్కోవాలని అనిపిస్తోందని.. బీజేపీ ఎంపీ సన్ని డియోల్ అన్నారని కేటీఆర్​ గుర్తుచేశారు.

హైదరాబాద్‌ నగర అభివృద్ధి అందరికి కనిపిస్తోంది కానీ.. విపక్షాలకు కనిపించట్లేదని కేటీఆర్​ మండిపడ్డారు. కేసీఆర్​ పాలనలో కరెంట్​, మంచినీరు, సౌకర్యాలు మెరుగుపడ్డాయి. నగరంలో ఈ తొమ్మిదేళ్లలో ఒక్క కర్ఫ్యూ కుడా లేదు. ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది. ఎస్​ఆర్​డీపీ, ఎస్​ఎస్​డీపీ కార్యక్రమాలతో రోడ్లు, నాలాలు బాగు చేసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

Telangana Assembly Elections 2023 : కేసీఆర్​ వచ్చాక రేషన్​ బియ్యం కోటాను.. ఒక వ్యక్తికి ఆరు కిలోలకు పెంచామని గుర్తు చేశారు. కేసీఆర్​ మూడోసారి గెలిచాక ఇంటింటికి వైట్​కార్డు ఉన్నవారికి అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం అందిస్తాం. ఆనాడు నరేంద్ర మోదీ గ్యాస్​ సిలిండర్​ ధర పెరిగిందని.. మన్మోహన్​ సింగ్​ను విమర్శించారు. ఈనాడు బీజేపీ పాలనలో గ్యాస్​బండ సామాన్యులకు గుదిబండగా మారింది. ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.

కేసీఆర్ మళ్లీ అధికారంలోకి​ వచ్చాక గ్యాస్​సిలిండర్​ను రూ. 400లకే అందిస్తామని.. మహిళలకు ప్రత్యేకంగా సౌభాగ్యలక్ష్మి పేరుతో.. 18 సంవత్సరాలు నిండిన వారందరికి నెలకు రూ. 3000 ఇస్తామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్​లో రాబోయే కాలంలో లక్ష బెడ్​రూంలు నిర్మించి ఇస్తామని.. హైదరాబాద్​ మెట్రోను నగరం నలుములలా 400 కిమీలకు పెంచుతామని కూడా కేటీఆర్ ప్రకటించారు. ఓటు వేసే సమయంలో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

"బీఆర్​ఎస్​ ప్రభుత్వం మూడోసారీ అధికారంలోకి రావాలి. లేదంటే హైదరాబాద్​ అభివృద్ధి ఆగిపోతుంది. కాంగ్రెస్​ హయాంలోని కరెంట్ ​కోతలు, మంచి నీటివెతలు మళ్లీ వస్తాయి. కేసీఆర్​ వంటి నాయకుణ్ని బ్రహ్మండమైన మెజార్టీతో గెలిపించాలి. రాష్ట్రంలో రైతుబంధుతోపాటు రైతుబీమా అమలు చేస్తున్నాము. రాబోయే సారీ వ్యవసాయ భూమి లేనివారికి.. రేషన్​ కార్డు ఉంటే చాలు కేసీఆర్​ బీమా పేరుతో.. బీమా కల్పిస్తాం". - కేటీఆర్​, మంత్రి

'సంపద పెంచాలి- పేదలకు పంచాలనేదే కేసీఆర్ సిద్ధాంతం'

KTR Counter to DK Shivakumar : హస్తం పార్టీ వైఫల్యాలు చూడటానికి కర్ణాటక వెళ్లాల్సిన అవసరం లేదు : డీకేకు కేటీఆర్ కౌంటర్

KTR Fires on Congress : 'రాహుల్, రేవంత్​ లాంటి వాళ్లుంటారని గాంధీజీ ఆనాడే ఊహించారేమో..?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.