KTR talked about the IT hub: ఐటీ, ఐటీ అనుబంధ రంగాలను ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు వాస్తవరూపం దాలుస్తున్నాయని ఐటీశాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లలో ఐటీ హబ్‌లు విజయవంతంగా పనిచేస్తున్నాయని, ఇతర ప్రాంతాల్లోని ఐటీ టవర్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని ఆయన అన్నారు. నిజామాబాద్, మహబూబ్‌నగర్ ఐటీ హబ్‌లు దాదాపు సిద్ధంగా ఉన్నాయని, త్వరలో ప్రారంభిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ తర్వాత సిద్దిపేట ఐటీ హబ్ ప్రారంభమవుతుందని, నల్గొండ ఐటీ హబ్ నిర్మాణం కూడా మరో నాలుగైదు నెలల్లో పూర్తవుతుందని తెలిపారు. ఐటీ హబ్‌ల పూర్తి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులను ఆయన అభినందించారు.
ఐటీ, ఐటీ అనుబంధ రంగాలకు జిల్లా కేంద్రాలకు విస్తరించడం ద్వారా డిజిటైజ్, డీకార్బనైజ్, డీసెంట్రలైజ్ అన్న త్రీడీ మంత్ర నెరవేరుతుందని, ద్వితీయ శ్రేణి నగరాల్లో మెట్రో నగరాలతో పోలిస్తే గ్రామీణ యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత మేరకు ఐటీ రంగాన్ని రాష్ట్రం నలుమూలలకు విస్తరించేందుకు కృషి చేస్తున్నామని, రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఐటీ హబ్‌గా మారిన వరంగల్ ఫలితాలే ఇందుకు నిదర్శమని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో అనువైన వాతావరణం, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించి ప్రపంచస్థాయి కంపెనీలను ఆకర్షించామని, అదే తరహాలో సదుపాయాలు కల్పిస్తున్న తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకూ కార్యకలాపాలను విస్తరించాలని ఆయా కంపెనీల అధినేతలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన యువత ద్వితీయశ్రేణి పట్టణాల్లో విద్యను అభ్యసిస్తున్నారని, వరంగల్ నిట్, బాసరలోని ట్రిపుల్ ఐటీలే ఇందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు.
-
“The best way to predict the future is to create it” - Lincoln
— KTR (@KTRTRS) June 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Delighted to announce that Hon’ble CM KCR Garu will be inaugurating the new facility of @THubHyd on 28th June giving a huge fillip to the Hyderabad Innovation ecosystem#InnovateWithTHub #HappeningHyderabad #THub pic.twitter.com/ZT1BtRWoGt
">“The best way to predict the future is to create it” - Lincoln
— KTR (@KTRTRS) June 26, 2022
Delighted to announce that Hon’ble CM KCR Garu will be inaugurating the new facility of @THubHyd on 28th June giving a huge fillip to the Hyderabad Innovation ecosystem#InnovateWithTHub #HappeningHyderabad #THub pic.twitter.com/ZT1BtRWoGt“The best way to predict the future is to create it” - Lincoln
— KTR (@KTRTRS) June 26, 2022
Delighted to announce that Hon’ble CM KCR Garu will be inaugurating the new facility of @THubHyd on 28th June giving a huge fillip to the Hyderabad Innovation ecosystem#InnovateWithTHub #HappeningHyderabad #THub pic.twitter.com/ZT1BtRWoGt
విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా సిద్ధం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. టీ-హబ్, టీ-వర్కర్స్, వీహబ్ వంటి ప్రాంతాలకు విద్యార్థులను తీసుకెళ్లడం ద్వారా ఆవిష్కరణలపై ఆసక్తి కల్పిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులకు ఆరు నెలల పాటు పరిశ్రమల్లో అప్రెంటిస్ షిప్ అవకాశాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఇవీ చదవండి: