ETV Bharat / state

రాష్ట్ర భవిష్యత్​ కోసం పెట్టిన పెట్టుబడి అప్పు ఎలా అవుతుంది? : కేటీఆర్​ - కేటీఆర్​ ఆన్ దళితబంధు

KTR on Dalit Bandhu in Telangana : కాంగ్రెస్​ నాయకులు బీఆర్​ఎస్​పై​ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్​ మండిపడ్డారు. దళిత బంధు, రైతు బంధు పథకాల విషయంలో విమర్శించే ముందు.. వారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర భవిష్యత్​ కోసం పెట్టిన పెట్టుబడి అప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు.

KTR Fire on Congress Leaders
KTR Latest Comments on Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2023, 8:27 AM IST

KTR Latest Comments రాష్ట్ర భవిష్యత్​ కోసం పెట్టుబడి పెడితే అప్పు ఎలా అవుతోంది

KTR on Dalit Bandhu in Telangana : 65 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి రైతుబంధు, దళితబంధు లాంటి ఆలోచనలు ఎందుకు రాలేదని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రభుత్వం అప్పులు చేసిందని గగ్గోలు పెడుతున్న విపక్షాలకు.. తెలంగాణలో విద్యుత్‌, సాగు, తాగునీటి రంగాల్లో జరిగిన అభివృద్ధి ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటిని సమానంగా చూస్తూ.. సంపదను పెంచుతూ పేదలకు పంచుతున్నామని స్పష్టం చేశారు.

KTR Latest Comments on Congress : హైదరాబాద్‌లో దళిత్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు, వ్యవస్థాపకులు నిర్వహించిన కార్యక్రమంలో.. మంత్రి కేటీఆర్​ పాల్గొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారత్‌లో దళితుల గురించి ఆలోచించింది ఒక్క బీఆర్​ఎస్​ మాత్రమేనని స్పష్టం చేశారు. ఓట్ల కోసం దళితబంధు తీసుకురాలేదన్న కేసీఆర్​.. ఆ సామాజికవర్గ ప్రజల అభ్యున్నతి కోసమే తెచ్చామని తెలిపారు. దళిత బంధు లాంటి పథకాన్ని 100 శాతం విజయవంతంగా అమలు చేసి చూపెడితే దేశానికే ఓ దిక్సూచి అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 65ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌(KTR Comments on Congress)కు దళిత బంధు లాంటి ఆలోచనే ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

'కొత్త సీసాలో పాత సారా లాంటి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ'

"కాంగ్రెస్​ నాయకులు దళిత బంధు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. మా ప్రభుత్వానికి దళితబంధు ఓకేసారి అందరికీ ఇవ్వాలని ఉంటుంది. కానీ నిధులు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది కదా. కాంగ్రెస్​ 65 ఏళ్ల పాలనలో ఉంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి.. ఒక్కసారైనా దళిత బంధు, రైతు బంధు, 24 గంటలు విద్యుత్​ ఆలోచన ఎందుకు రాలేదు? ఇలాంటి అంశాలు గుర్తుకు రావు కానీ.. బీఆర్​ఎస్​ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం వచ్చు." - కేటీఆర్​, ఐటీ శాఖ మంత్రి

KTR Reaction on Congress Leaders Comments : బీఆర్​ఎస్​ సర్కార్‌ రాష్ట్రంపై అప్పుల భారం మోపిందని.. విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. భవిష్యత్‌ కోసం పెట్టిన పెట్టుబడి అప్పు ఎలా అవుతందని(KTR Clarity on Debits in Telangana) ప్రశ్నించారు. మూసధోరణిలో కాకుండా యువత ఆసక్తి ఉన్న రంగాల వైపు వెళ్లాలని మంత్రి కేటీఆర్ సూచించారు. యువత ఆలోచనలకు పదును పెడితే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు.

నిలోఫర్‌ కేఫ్​లో సందడి చేసిన కేటీఆర్‌

"భారతదేశంలో పేదలకు డబుల్​ బెడ్​ రూం ఇళ్లు ఇవ్వాలన్న ఆలోచన ఎవరికీ రాలేదు.. ఒక్క కేసీఆర్​కు మాత్రమే వచ్చింది. రైతుబంధు నిధులు కర్షకులకు కేటాయించడంలో అవకతవకలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. సరే ఆ ఆంశం మీద ఆలోచన చేస్తాం. పథకాల విషయంలో కేసీఆర్​ మాకు.. సంపద పెంచాలి.. పేదలకు పంచాలని చెబుతారు. రాష్ట్రానికి అప్పు తెచ్చి.. అభివృద్ధి చేసినప్పుడు.. అది అప్పు అవ్వదు. అలాంటి అభిప్రాయం నుంచి యువత బయటకు రావాలి." - కేటీఆర్​, ఐటీ శాఖ మంత్రి

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి మాట దేవుడెరుగు - 6 నెలలకో సీఎం మారడం పక్కా : మంత్రి కేటీఆర్‌

'పరిగి నియోజకవర్గానికి త్వరలోనే కృష్ణ నీళ్లు తెప్పిస్తా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.