Ktr not attend BRS party office inaguration: ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కె.చంద్రశేఖరరావు ప్రత్యేక అనుమతితో ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోతున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రఖ్యాత వాహన దిగ్గజం మారుతీ సుజుకికి చెందిన అంతర్జాతీయ విభాగాల అధిపతులతో ముందే సమావేశాన్ని ముందే నిర్ణయించారు.
మంత్రి కేటీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు మారుతీ సుజుకి ప్రత్యేక బృందం హైదరాబాద్ చేరుకుంది. జపాన్ కంపెనీలు సమయపాలన, షెడ్యూలింగ్ వంటి విషయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాయి. జపాన్‌కు చెందిన సుజుకి కంపెనీతో గత కొంతకాలంగా విస్తృతంగా నడుస్తున్న పెట్టుబడులపై సంప్రదింపులు చేశారు. ఈ నేపథ్యంలోనే సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం 10.45కు సలార్పురియా నాలెడ్జ్ పార్కులో Bosch ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
ఇవీ చదవండి: