ETV Bharat / state

9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ట్రైలర్‌ మాత్రమే : కేటీఆర్‌ - వ్యాపరవేత్తలతో కేటీఆర్ మీటింగ్

KTR Meeting with Industrialists in Hyderabad : స్టేబుల్ గవర్నమెంట్.. ఏబుల్ లీడర్​షిప్ వల్లే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరిగిందని.. హైదరాబాద్‌లోని పారిశ్రామిక వేత్తతో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే పారిశ్రామిక వేత్తల సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చారు.

KTR Guarante to Industrialists Telangana
KTR Meeting with Industrialists
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2023, 6:45 PM IST

KTR Meeting with Industrialists in Hyderabad : రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాగానే.. పారిశ్రామికవేత్తల సమస్యలన్ని తీరుస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఓట్లు కోసం అబద్దం చెప్పట్లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని ఓ హోటల్‌లో పారిశ్రామిక వేత్తలతో మంత్రి కేటీఆర్‌(KTR) సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా పారిశ్రామిక వేత్తలు(Industrialists) తమ సమస్యలను తెలిపారు. కొత్త పరిశ్రమలకు ఇచ్చినట్టే పాత కంపెనీలకు రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఫార్మాతో పాటు, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్రంలో విద్యుత్ తగినంత ఉండటం వల్లే పారిశ్రామిక వృద్ధి సాధ్యమైందని ప్రశంసించారు.

గులాబీల జెండాలే రామక్క - మన రామన్న స్టెప్పేసిండే రామక్క

KTR Comments on Congress : కర్ణాటక నుంచి వచ్చిన ఓ నాయకుడికు స్క్రిప్ట్‌ సరిగ్గా ఇవ్వకపోవడంతో... తెలంగాణలో 5 గంటలు మాత్రమే విద్యుత్‌ ఇస్తున్నట్లు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ట్రైలర్‌ మాత్రమేనని.. మళ్లీ బీఆర్ఎస్‌(BRS) అధికారంలోకి వస్తే 24 గంటలు నీళ్లు ఇస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. మళ్లీ ప్రభుత్వం రాగానే పారిశ్రామిక వేత్తల సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. ఇండస్ట్రీ పెట్టాలనుకునే వారికి 15 రోజుల్లోనే స్వీయ ధృవీకరణ పత్రాలు ఇస్తున్నామని.. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి పారిశ్రామిక వేత్తలు తెలంగాణకు వస్తున్నారని అన్నారు.

'కేసీఆర్ నవంబర్‌ 30న బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టడం ఖాయం'

KTR Meeting with Industrialists : స్టేబుల్ గవర్నమెంట్.. ఏబుల్ లీడర్​షిప్​ వల్లే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరిగిందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. దిల్లీ, గుజరాత్‌ నుంచి నాయకులు వచ్చి రాష్ట్రంలో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని నాయకులు ఆరోపిస్తున్నారని.. అబద్దం వంద సార్లు చెప్తే నిజం అయిపోదని ధ్వజమెత్తారు. రైతుబంధు వల్ల ఎక్కువ భూమి ఉన్న వాళ్లకే లాభం జరుగుతుందని.. అందుకే మళ్లీ ప్రభుత్వంలోకి రాగానే రైతుబంధు(RYTHU Bnadu)కు పరిమితి విధించే అంశంలో పరిశీలిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మల్లాపూర్, గాంధీనగర్, జీడిమెట్ల, నాచారం, చర్లపల్లి పారిశ్రామికవాడల ఛైర్మన్లు పాల్గొన్నారు.

"రాష్ట్రం ఏర్పడిన తరవాత 9 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశాం. కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్నో అనుమానాలు ఉండేవి.. పరిపాలన సాధ్యమవుతుందా అనేవారు. ఎన్నో అనుమానాల మధ్య పరిపాలన ప్రారంభమయింది.. ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రెండు రోజులకోకసారి కూడా కరెంట్‌ లేని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం 24 గంటలు ఉచిత విద్యుత్‌ ప్రభుత్వం అందిస్తోంది."- కేటీఆర్‌, ఐటీ శాఖ మంత్రి

KTR Meeting with Industrialists in Telangana మళ్లీ ప్రభుత్వం వస్తే పారిశ్రామిక వేత్తల సమస్యలు తీరుస్తాం

మళ్లీ అధికారంలోకి వస్తే రైతు బంధు కటాఫ్​ను పరిశీలిస్తాం : కేటీఆర్‌

ప్రజల హక్కుల కోసం పోరాడే ఏకైక టీమ్ బీఆర్ఎస్ : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.