ETV Bharat / state

పురపాలికలకు నిధులివ్వండి.. కేంద్రమంత్రులకు కేటీఆర్ లేఖ - తెలంగాణ వార్తలు

హైదరాబాద్ నగరంలో తలపెట్టిన సమగ్ర మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు, నాలాలా అభివృద్ధి పథకం, వరంగల్ మెట్రో సహా ఇతర పురపాలికల్లోని వివిధ పనుల కోసం రానున్న కేంద్ర బడ్జెట్​లో నిధులు కేటాయించాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరీ, నిర్మలా సీతారామన్​కు లేఖ రాశారు. ఆయా కార్యక్రమాలకయ్యే ఖర్చులో కనీసం 20 శాతం నిధులను దాదాపు రెండు వేల కోట్లను రానున్న కేంద్ర బడ్జెట్​లో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

ktr
ktr
author img

By

Published : Dec 30, 2020, 4:27 PM IST

పురపాలకశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలకు కేంద్ర బడ్జెట్​లో నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ కోరారు. ఈ మేరకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో పాటు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్​కు లేఖ రాశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లో ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలను లేఖలో పేర్కొన్నారు. దీర్ఘకాలిక, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి ధ్యేయంగా అర్బన్ అగ్లోమరేశన్ ఏరియా కింద వివిధ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

సమగ్ర మురుగునీటి వ్యవస్థ

నగర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమగ్ర మురుగునీటి వ్యవస్థ బృహత్ ప్రణాళిక దిశగా ప్రభుత్వం ఇప్పటికే సర్వే, డిజైన్, అంచనాల నిర్ధరణ వంటి కార్యక్రమాలను పూర్తి చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్​లో భాగంగా మూడు ప్యాకేజీల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. మురుగునీటి శుద్ధి కేంద్రాలతో పాటు మురికి నీటి ట్రంక్ లైన్ల ఏర్పాటు తదితర అంశాలతో డీపీఆర్ సిద్ధమైందని మంత్రి వెల్లడించారు. మూసీ నది కాలుష్యం విషయమై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్​కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.

20శాతం ఇవ్వండి

ఎస్టీపీలతో పాటు సీవరేజ్ కలెక్షన్ నెట్​వర్క్ ట్రంక్, సివర్ లైన్ల నెట్​వర్క్ మొత్తం 2,232 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం ఉంది. ఇందుకోసం దాదాపు రూ.3,722 కోట్లు అవసరం. రానున్న మూడేళ్లలో ఈ పనులను పూర్తి చేస్తాం. సమగ్ర మురుగునీటి వ్యవస్థ బృహత్ ప్రణాళికకయ్యే ఖర్చులో 20శాతం నిధులను రూ.750 కోట్లు రానున్న కేంద్ర బడ్జెట్​లో కేటాయించాలి. రికార్డు స్థాయిలో వచ్చిన వరదలపై అధ్యయనం తర్వాత వ్యూహాత్మక నాలాల అభివృద్ధి పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా నాలాలు, వాటర్ డ్రైన్​ల అభివృద్ధి పనులు చేయనున్నాం. ఇందుకోసం రూ.1,200 కోట్లు వార్షిక ప్రణాళికను సిద్ధం చేశాం. అందులో కనీసం 20 శాతం రూ.240 కోట్లు కేంద్ర బడ్జెట్​లో ప్రత్యేకంగా కేటాయించాలి.

- కేటీఆర్, పురపాలకశాఖ మంత్రి

వరంగల్​లో నియో మెట్రో

హైదరాబాద్ తర్వాత అతిపెద్ద పట్టణమైన వరంగల్ నగర ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నియో మెట్రో రైల్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్​ తెలిపారు. నియో మెట్రోకు సంబంధించిన ప్రమాణాలు, ప్రత్యేకతలకు కేంద్రం తుది రూపు ఇచ్చిన నేపథ్యంలో, వరంగల్ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం 15 లక్షలు ఉన్న వరంగల్ జనాభా 2051 నాటికి 35 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని... అక్కడ నాసిక్ తరహాలో నియో మెట్రో ప్రాజెక్ట్​ను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్​ పేర్కొన్నారు. నాసిక్ మెట్రోకు డీపీఆర్ రూపొందించిన మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో వరంగల్​కు కూడా డీపీఆర్ సిద్ధమైందని చెప్పారు. దాదాపు 15.5 కిలోమీటర్ల మేర వరంగల్ మెట్రో కారిడార్​కు రూ.1,050 కోట్లు ఖర్చు అవుతాయన్నారు. అందులో కనీసం 20 శాతం అంటే రూ.210 కోట్లను ఈక్విటీ లేదా గ్రాంట్ రూపంలో రానున్న కేంద్ర బడ్జెట్​లో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

వ్యర్థాల శుద్ధి కేంద్రాలు

రాష్ట్రంలోని ఇతర పట్టణాలు, నగరాల్లో చేపట్టిన వివిధ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ పథకాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయని... సమగ్ర వ్యర్థాల నిర్వహణ కోసం దాదాపు రూ.258 కోట్లతో టెండర్లు పిలిచినట్లు మంత్రి తెలిపారు. వివిధ పురపాలికల్లో పేరుకుపోయిన 70 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను రూ.520 కోట్ల వ్యయంతో బయోమైనింగ్, రెమెడియేషన్ చేస్తున్నామని, రూ.250 కోట్లతో మానవవ్యర్థాల శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

30 పట్టణాల్లో భూగర్భ డ్రైనేజీలు

ఎన్జీటీ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలోని 57 పురపాలికల్లో సుమారు రూ.13,228 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టామని చెప్పారు. వృథానీటి శుద్ధి ప్రాజెక్టు కోసం మొదటి దశలో 30 పట్టణాల్లో రూ.2,828 కోట్లతో పనులు చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. వచ్చే ఏడాది దాదాపు రూ.3,777 కోట్లతో ఈ పనులు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అందులో కనీసం 20 శాతం రూ.750 కోట్లను కేంద్ర బడ్జెట్​లో కేటాయించాలని కోరారు.

ఇదీ చదవండి : న్యూ ఇయర్ గిఫ్ట్: బార్లు, క్లబ్బులకు అర్ధరాత్రి వరకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.