కరోనా బాధితుల చికిత్సకు అవసరమైన వెంటిలేటర్‌ను టీవర్క్స్ తక్కువ ఖర్చులో అందుబాటులోకి తీసుకొచ్చింది. వివిధ ఇంజినీరింగ్ సంస్థల భాగస్వామ్యంతో రూపొందించిన ఈ వెంటిలేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యంతో టీ వర్క్స్‌కు చెందిన 20 మంది యువ నిపుణులు...30 రోజుల్లో ఈ వెంటిలేటర్‌ను తయారు చేశారు.
ఇందుకోసం అనేక వివిధ ప్రోటోటైప్ పరికరాలను ఉపయోగించి, పలుమార్లు వాటిని పరిశీలించిన తరువాత ప్రస్తుత నమూనాను తయారు చేశారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఈ వెంటిలేటర్‌తో రోగికి అవసరమైన సేవలు అందించేందుకు అన్ని రకాల సౌకర్యాలు ఇందులో ఉన్నాయన్నారు. రూ.35 వేల ఖర్చుతో తయారుచేసిన దీని నిర్మాణంలో నిమ్స్ వైద్యుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. రానున్న రోజుల్లో మరింత చౌకగా అత్యుత్తమ సౌకర్యాలతో అందించనున్నట్లు టీవర్క్స్ ప్రకటించింది.
ఇవీచూడండి: పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది