హైదరాబాద్ దోమలగూడలో పంచతత్వ పార్కును మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రారంభించనున్నారు. ఎకరం విస్తీర్ణంలో ఆక్యుప్రెజర్ వాకింగ్ ట్రాక్ ఈ పార్కు ప్రత్యేకత. ఈ పద్ధతిలో 8 అంశాలతో పార్కును సిద్ధం చేశారు. సర్కిల్ పద్ధతిలో ఉన్న ఈ ట్రాక్‌పై నడుస్తున్నప్పుడు పాదాల్లోని నరాలపై ఒత్తిడి కలిగించేలా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. 20 ఎం.ఎం, 10 ఎం.ఎం రాళ్లు, రివర్ స్టోన్స్, 6 ఎం.ఎం చిప్స్, ఇసుక, చెట్ల బెరడు, నల్లరేగడి మట్టి, నీటి బ్లాక్‌లను విడివిడిగా అనుసంధానం చేస్తూ ట్రాక్‌ను నిర్మించారు.
ఆరోగ్యంపై సానుకూల ప్రభావం
ట్రాక్‌పై మొదట నరాలపై అధిక ఒత్తిడి కలిగించి క్రమంగా ఒత్తిడి తగ్గించే ట్రాక్ వైపు నడవటం వల్ల రక్త ప్రసరణలో సానుకూల మార్పు జరిగి వివిధ రకాల అనారోగ్యాలు దూరమవుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పార్కు మధ్యలో గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ సర్కిల్‌కు అన్ని వైపులా 40 రకాల మెడిసినల్, హెర్బల్ మొక్కలని పెంచారు.
ఇదీ చదవండి: ప్రయాణికులు లేక డ్యూటీలు కోల్పోయిన ఉద్యోగులకు భరోసా