ktr Inaugurate Uppal Skywalk : హైదరాబాద్ ఉప్పల్‌లో నిర్మించిన స్కైవాక్ అందుబాటులోకి వచ్చింది. మంత్రి కేటీఆర్ దీనిని ప్రారంభించారు. ఎక్కడా రోడ్డు దాటే అవసరం లేకుండా రూ.25 కోట్లతో హెచ్ఎండీఏ ఈ నిర్మాణం చేపట్టింది. ఉప్పల్, ఎల్బీనగర్, రామంతాపూర్, సికింద్రాబాద్ రహదారులు, మెట్రోస్టేషన్‌తో స్కైవాక్‌ను అనుసంధానం చేశారు. వృద్ధులు, మహిళలు, గర్భిణులు చేరుకునేందుకు ఎస్కలేటర్లు, లిఫ్టుల సౌకర్యం కల్పించారు. 640 మీటర్లు పొడవు.. 4 మీటర్ల వెడల్పుతో నిర్మించిన స్కైవాక్ సౌకర్యాన్ని వినియోగించుకునేలా 8 లిఫ్టులు, 6 మెట్ల మార్గాలు, 12 ఎస్కలేటర్లు, 4 ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేశారు.
ఉప్పల్ స్కైవాక్ టవర్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్.. శిల్పారామంలో మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్‌ను ప్రారంభించారు. అనంతరం ఉప్పల్ మున్సిపల్‌గ్రౌండ్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పటికి కట్టుబడి ఉంటుందన్న కేటీఆర్.. ఎయిర్‌పోర్టు మెట్రోను రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. నారపల్లి నుంచి ఉప్పల్ వరకు ప్లైఓవర్ నిర్మిస్తామనుకుంటే కేంద్రం ముందుకు వచ్చిందని.. కానీ ఇప్పటికి పనులు కొనసాగడం లేదని కేటీఆర్ వివరించారు.
KTR Fires on JP Nadda : కేసీఆర్, మోదీల పనితీరుకు ఉప్పల్, అంబర్‌పేటలో కేంద్రం నిర్మిస్తున్న.. పైవంతెనలే నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. నాగర్‌కర్నూల్ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తెలంగాణాను అభివృద్ధి చేసినందుకు కేసీఆర్‌ను జైలుకు పంపుతారా అంటూ నడ్డాపై విరుచుకుపడ్డారు.
KTR Comments on congress : ప్రజల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో.. అమరుల త్యాగాలను కాంగ్రెస్ అవహేళన చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. అవినీతికి, అక్రమాలకు పాల్పడుతూ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడేలా చేస్తున్నారని.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోవాలంటే మరోసారి బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి రావాలంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.
"వేసవి కాలంలో నీటి ఇబ్బందులు లేకుండా సీఎం కేసీఆర్ పరిష్కరించారు. నారపల్లి నుంచి ఉప్పల్ వరకు రహదారి నిర్మాణం పూర్తి అయితే ట్రాఫిక్ సమస్యలు తీరుతాయి. కేంద్రం నిర్లక్ష్యం వల్ల నాలుగేళ్ల నుంచి రహదారి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో కరెంట్ కష్టాలు ఉన్నాయి. ప్రస్తుతం 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాం." - కేటీఆర్, మంత్రి
ఇవీ చదవండి: KTR Speech at Warangal : 'మనం ఎప్పుడో తెచ్చిన పథకాలను కేంద్రం ఇప్పుడు తెస్తోంది'
Minister KTR Latest Tweet : 'హైదరాబాద్ వాసులకు ఇక తాగునీటి సమస్యే ఉండదు'