ETV Bharat / state

'అవకాశాలను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ముందే ఉంటుంది' - సీఐఐ ఇన్​వెస్ట్ ఇన్ తెలంగాణ వార్తలు

పెట్టుబడులే లక్ష్యంగా ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ పేరుతో భారతీయ పరిశ్రమల సమాఖ్య ఓ భారీ వర్చువల్ సదస్సు ప్రదర్శనను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నేటి నుంచి నవంబర్ 24 వరకు... 90 రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుందని ప్రకటించింది.

ktr-in-cii-invest-in-telangana-programme
'అవకాశాలను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ముందే ఉంటుంది'
author img

By

Published : Aug 27, 2020, 2:34 PM IST

రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, కొవిడ్ అనంతర అవకాశాలపై భారతీయ పరిశ్రమల సమాఖ్య ఓ భారీ వర్చువల్ సదస్సు ప్రదర్శనను ప్రారంభించింది. 90 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో మంత్రి కేటీఆర్​ పాల్గొని ప్రసంగించారు.

కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అభివృద్ధి ప్రణాళికను కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సీఐఐ కీలకపాత్ర పోషిస్తోందని.. తెలంగాణ రాష్ట్రం బిజినెస్ ఎకోసిస్టం, వనరులు, రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూలతల ప్రదర్శనకు... ఈ సదస్సు దోహదపడుతుందని.. తద్వారా రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉపకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లతో డిజిటలైజేషన్ పరిశ్రమలకు కొత్త అవకాశాలు తెచ్చిపెట్టిందని.. ఆ అవకాశాలను తెలంగాణ రాష్ట్రం వేగంగా అందిపుచ్చుకుంటోందని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,795 కరోనా కేసులు, 8 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.