ETV Bharat / state

తెలంగాణ వార్షిక వృద్ధిరేటు 8.2 శాతం.. నివేదిక విడుదల చేసిన కేటీఆర్ - వార్షిక ప్రగతి నివేదిక విడుదల చేసిన కేటీఆర్

హైదరాబాద్​లో మంత్రి కేటీఆర్... పరిశ్రమల శాఖ వార్షిక ప్రగతి నివేదికను విడుదల చేశారు. జాతీయ జీడీపీలో రాష్ట్ర వాటా గత ఏడాదితో పోలిస్తే 2019- 20 సంవత్సరానికి 4.76 శాతంగా నమోదైంది.

KTR has released the annual progress report of the Industries Department
పరిశ్రమల శాఖ వార్షిక ప్రగతి నివేదిక విడుదల చేసిన కేటీఆర్
author img

By

Published : Jun 23, 2020, 7:17 PM IST

పరిశ్రమల శాఖ వార్షిక ప్రగతి నివేదికను ఆ శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. జాతీయ జీఎస్​డీపీ సగటుతో పోల్చుకుంటే తెలంగాణ 8.2 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. జాతీయ జీడీపీలో రాష్ట్ర వాటా గత ఏడాది నమోదైన 4.55 శాతంతో పోలిస్తే 2019- 20 సంవత్సరానికి 4.76 శాతంగా నమోదైంది. తలసరి ఆదాయం విషయంలోనూ... జాతీయ సగటు రూ.1, 34, 432తో పోల్చినప్పుడు ఆదాయం రూ. 2,28,216గా నమోదైంది.

దేశ ఎగుమతుల్లోనూ తెలంగాణ వాటా 10.61 శాతం నుంచి 11.58 శాతానికి పెరిగింది. ఇప్పటి దాకా టీఎస్​ ఐపాస్ ద్వారా వచ్చిన పెట్టుబడుల మొత్తం రూ. 1,96,404 కోట్లు కాగా... ఇప్పటిదాకా అనుమతులు పొందిన 12,021 పరిశ్రమల్లో 75 శాతానికి పైగా తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. భారత్​లోనే అత్యధికంగా నెట్ ఆఫీస్ అబ్​సార్ప్​​క్షన్​​ విషయంలో హైదరాబాద్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో తెలంగాణ వాటా 35 శాతంగా ఉంది.

ఇవీ చూడండి: సిరిసిల్లను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం:కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.