ETV Bharat / state

KTR Fires on Modi in Twitter : "బరాబర్​ మాది కుటుంబపార్టీయే.. రాష్ట్రమే మా కుటుంబం" - బీఆర్​ఎస్​ తాజా వార్తలు

KTR Fires on Modi in Twitter : నమో అంటే నమ్మించి మోసం చేయడమేనని.. తెలంగాణ ప్రజలకు తెలుసని మంత్రి కేటీఆర్​ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు కాదు.. జాతీయస్థాయిలో అధికార మార్పు కావాలని దేశ ప్రజలు కోరుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

KTR Fires on Modi
KTR Fires on Modi in Twitter
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 1, 2023, 7:38 PM IST

KTR Fires on Modi in Twitter : బీఆర్​ఎస్​ పార్టీ స్టీరింగ్ కేసీఆర్ చేతిలోనే పదిలంగా ఉందని.. బీజేపీ స్టీరింగ్(BJP) అదానీ చేతిలోకి వెళ్లిపోయిందని ట్విటర్​ వేదికగా మంత్రి కేటీఆర్​(KTR on X) ఎద్దేవా చేశారు. నమో అంటే.. నమ్మించి మోసం చేయడమేనని ప్రజలకు తెలుసని విమర్శించారు. బీజేపీ హయాంలో కిసాన్ సమ్మాన్​ కింద ఇచ్చింది కేవలం నామమాత్రమేనని.. కానీ ఒక చిన్న రాష్ట్రమైన తెలంగాణ 70 లక్షల మంది రైతులకు.. 72 వేల కోట్లను నేరుగా ఖాతాల్లో వేసిన విషయం తెలుసుకుంటే మంచిదని చురకంటించారు.

Minister KTR Tour in Ramagundam : కేసీఆర్​ అంటే నమ్మకం.. మోదీ అంటే అమ్మకం: కేటీఆర్

KTR Latest News : రైతుల రుణమాఫీ జరగనే లేదని మాట్లాడటం.. మిలియన్ డాలర్ జోక్ అన్నారు. స్వతంత్ర భారత చరిత్రలోనే.. రెండుసార్లు రైతుల రుణమాఫీకి నడుం బిగించిన ఏకైక సందర్భం తెలంగాణలోనే ఆవిష్కృతమైందని కేటీఆర్ స్పష్టం చేశారు. అన్నదాత అప్పులు మాఫీ చేసి జైకిసాన్ ప్రభుత్వం తమది అని.. కార్పొరేట్ దోస్తులకు రూ.14.5 లక్షల కోట్ల రుణాలను రద్దుచేసిన.. నై కిసాన్ సర్కారు బీజేపీదని మండిపడ్డారు.

కర్షకుల రక్తం కండ్ల జూసిన రైతుహంతక రాజ్యం బీజేపీదని దుయ్యబట్టారు. పదేళ్లపాటు విభజన హామీలను పాతరేసి.. ఎన్నికల హామీలను గాలికి వదిలేసి, ఓట్ల వేటలో ఇప్పుడొచ్చి మాట్లాడితే నమ్మేదేవరు అని మంత్రి కేటీఆర్​ ప్రశ్నించారు. ప్రాజెక్టుల వల్ల చుక్క నీరు రాలేదనడం.. బీజేపీ అవివేకానికి నిదర్శనం అన్నారు. తెలంగాణలో సాగుతోంది సాగునీటి విప్లవం.. తెలంగాణ రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేక చేతులెత్తేసిన బీజేపీనా మాట్లాడేది అని ఎద్దేవా చేశారు.

KTR on Twitter : తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనమంటే నూకలు తినమన్న నాయకుల అవమానకర మాటలు.. తెలంగాణ రైతులు మరిచిపోలేదన్నారు. నాయకులు ఎన్ని చెప్పినా.. బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయన్నారు. నిన్న కాళేశ్వరం అయినా.. నేడు పాలమూరు ప్రాజెక్టు అయినా.. ప్రపంచ సాగునీటి చరిత్రలోనే అతి గొప్ప మానవ నిర్మిత అద్భుతాలు.. భవిష్యత్తు ఇరిగేషన్ రంగానికే సరికొత్త పాఠాలు అని కేటీఆర్ పేర్కొన్నారు.

  • నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు తెలుసు

    తెలంగాణ ప్రజలు కాదు..
    జాతీయస్థాయిలో అధికార
    మార్పు కావాలని కోరుతోంది దేశ ప్రజలు..

    BRS పార్టీ స్టీరింగ్
    కేసీఆర్ గారి చేతిలోనే పదిలంగా ఉంది.
    కానీ బిజెపి స్టీరింగ్..
    అదాని చేతిలోకి వెళ్లిపోయింది.

    మీరు కిసాన్ సమాన్ కింద…

    — KTR (@KTRBRS) October 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇయ్యాల..మోదీ వచ్చి బీఆర్​ఎస్​ది కుటుంబ పార్టీ అని అన్నాడట అవును మాది.. బరాబర్ పక్కా కుటుంబ పార్టీయే అని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలంతా తమ కుటుంబ సభ్యులే అని, తమ నాయకుడు కేసీఆర్ తమ కుటుంబపెద్ద అని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణే తన సొంత కుటుంబం అనుకున్నడు కాబట్టే.. ఇంటికి పెద్దకొడుకై.. అవ్వలకు ఆసరాగా నిలిచి 2వేల పెన్షన్ అందిస్తున్నారు- కేటీఆర్

కంటి చూపు మసకబారి.. జారి కిందపడి కాలో.. చేయో విరిగి మంచాన పడే కష్టం రాకూడదని కంటి పరీక్షలు చేసి కళ్లజోడు అందిస్తున్నడన్నారు. మేనమామై.. లక్ష నూటపదహార్ల కానుకిచ్చి లక్షణంగా లగ్గం చేస్తున్నడని, అక్కా చెల్లెళ్లు బిందెలు పట్టుకొని నీళ్ల కోసం మైళ్ల దూరం నడిచే కష్టం తీర్చాలని ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చాడని స్పష్టం చేశారు.

అన్నలాగా..ఆడబిడ్డకు పుట్టింటి ప్రేమతో పురుడుపోసి కేసీఆర్ కిట్‌ను అందిస్తున్నాడన్నారు. గిరిజన వర్శిటీ తెలంగాణ హక్కు.. తొమ్మిదిన్నర ఏండ్లుగా తొక్కిపెట్టి.. విభజన చట్టంలోని హామీని తుంగలో తొక్కి.. ఆదివాసి పిల్లలకు అన్యాయం చేసి..ఇప్పుడేదో ఉద్ధరించినట్టుగా ప్రధాని నరేంద్రమోదీ ఫోజులు కొడుతున్నారని ట్విటర్​ వేదికగా మండిపడ్డారు.

Minister KTR Comments on Balka Suman : బాల్క సుమన్​ మంత్రి అయితే ఎన్నో అద్భుతాలు చేస్తారు: కేటీఆర్

Minister KTR Peddapalli District Tour Today : పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో నేడు మంత్రి కేటీఆర్ బిజీబిజీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.