KTR Fires on Congress Party : కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ బీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి కేటీఆర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిట్టా బాలకృష్ణారెడ్డి తిరిగి స్వగృహానికి చేరుకున్నారని కేటీఆర్ అన్నారు. బాలకృష్ణారెడ్డి తొందరపడి 2009లో పార్టీ నుంచి వెళ్లిపోయారని.. ఆయన రాకతో తప్పిపోయిన కుమారుడు మళ్లీ తిరిగి ఇంటికి వచ్చినట్లు ఉందని హర్షం వ్యక్తం చేశారు.
Jitta Balakrishna Reddy joined in brs : ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం కోసం యుద్ధాలు చేయాల్సి వచ్చినప్పుడు బాలకృష్ణారెడ్డి తమకు తోడుగా ఉన్నారని.. ఉద్యమ నేతలు అందరూ తిరిగి తమ పార్టీలో చేరుతున్నారని కేటీఆర్ తెలిపారు. ఈ క్రమంలోనే కొందరు నేతలు మాయమాటలు చెప్పి మోసగించాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. నోట్ల కట్టలతో దొరికిన రేవంత్ డబ్బులు పంచను అని ప్రమాణం చేయాలంటూ సవాల్ విసురుతున్నారని.. రేవంత్ తీరు హంతకుడే సంతాపం తెలిపినట్లుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎన్నో బాధలు పెట్టి తెలంగాణ ఇచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నో పోరాటాలు చేసిన తర్వాతే తెలంగాణ ఇచ్చారన్నారు. రాష్ట్రం ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి కల్పించింది బీఆర్‌ఎస్ పార్టీనే అని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి నినాదాలతో ముందుకెళ్తున్నామన్న ఆయన.. తెలంగాణ కంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తాము ఎవరికీ బీ టీమ్ కాదని.. తెలంగాణ ప్రజలకు ఏ టీమ్ అని పునరుద్ఘాటించారు.
TNGO Former President Mamilla Rajender Joined in BRS : బీసీ జనగణన చేయాలని గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీసీ జనగణనను రాహుల్ ఎందుకు చేయలేదని నిలదీశారు. ఈ 9 ఏళ్లలో తెలంగాణలో ఏం తక్కువైందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారన్న ఆయన.. మళ్లీ రూ.20 పింఛను ఇస్తారా అని అడిగారు. కాంగ్రెస్‌కు ఐదారుగురు సీఎం అభ్యర్థులు దొరికారు కానీ.. ఓటర్లే లేరని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఎవరి వల్ల మేలు జరిగిందో ప్రజలు చర్చించాలని సూచించారు. కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఎవరి చేతిలోనో పెట్టొద్దని మంత్రి కోరారు.
KTR Fires on Modi in Twitter : "బరాబర్ మాది కుటుంబపార్టీయే.. రాష్ట్రమే మా కుటుంబం"
బీసీ జనగణన చేయాలని గతంలోనే అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీసీ జనగణనను రాహుల్ ఎందుకు చేయలేదు. ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అంటున్నారు. మళ్లీ రూ.20 పింఛను ఇస్తారా. తెలంగాణకు ఎవరి వల్ల మేలు జరిగిందో చర్చించాలి. కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఎవరి చేతిలోనో పెడదామా? కాంగ్రెస్‌కు ఐదారుగురు సీఎం అభ్యర్థులు దొరికారు.. ఓటర్లే లేరు. - మంత్రి కేటీఆర్