ETV Bharat / state

'రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం వల్లే దేశం సమాఖ్య స్ఫూర్తిని కోల్పోతుంది'

KTR Fires On Central Government: కేంద్రానిది సహకార సమాఖ్య కాదు.. బలవంతపు సమాఖ్య అని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర పోటీ ఉండాలన్న ఆయన.. కేంద్రం పెత్తనం ఉండరాదని మండిపడ్డారు. భారత్‌ నిజమైన సమాఖ్య దేశమేనా అనే అంశంపై హైదరాబాద్‌లో నిర్వహించిన దక్షిణ్‌ డైలాగ్స్‌ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు.

కేటీఆర్
కేటీఆర్
author img

By

Published : Sep 17, 2022, 8:52 PM IST

KTR Fires On Central Government: రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం వల్లే దేశం సమాఖ్య స్ఫూర్తిని కోల్పోతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జీడీపీలో కాకుండా గుజరాత్ డెవలప్​మెంట్​లో దేశాన్ని ప్రధాని మోదీ ముందుకు తీసుకెళ్తున్నారని విమర్శించారు. హైదరాబాద్​లో ఓ హోటల్ లో దక్షిణ్ డైలాగ్స్ సంస్థ నిర్వహించిన సౌత్ ఫస్ట్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వక్తల ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు పోటాపోటీగా కేంద్ర మంత్రులు కార్యక్రమాలు చేపట్టడం ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అంటున్న టీమ్‌ ఇండియా స్ఫూర్తి ఏమైందని ప్రశ్నించారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదానికి కేంద్రం దూరంగా వెళ్తుందని మంత్రి కేటీఆర్​ ఎద్దేవా చేశారు.

రాష్ట్రానికి కేటాయించే నిధుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతుందని ఎంపీ శశిథరూర్ అన్నారు. కేంద్రం ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కో తరహాలో చూడటం సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా ఉందని శశిథరూర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తమిళనాడు ఆర్థిక మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పల్వనీల్‌ త్యాగరాజన్‌ తదితరులు పాల్గొన్నారు.

"ప్రధానమంత్రి టీం ఇండియా గురించి ఎప్పుడూ మాట్లాడుతారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు అన్ని రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటుచేసింది? ఎన్నిసార్లు అన్ని రాష్ట్రాలు కూర్చొని చర్చించుకున్నాయి? ఆరోగ్య రంగంలో తమిళనాడు బాగా పనిచేస్తోంది. దాని గురించి ఇతర రాష్ట్రాలు కూడా తెలుసుకోవాలికదా! దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మంచి పనులు జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాలు ఎందుకు నేర్చుకోకూడంటూ అందరినీ కలిపి కేంద్రం సమావేశం ఏర్పాట చేసిన సందర్భం నాకు ఎక్కడా కనిపించలేదు. కేంద్రం సహకార సమాఖ్య గురించి మాట్లాడుతుంటుంది. ఇలాంటివి వినడానికి బాగుంటాయి. కానీ నిజంగా అది జరుగుతోందా? లేదు! వీరి (కేంద్రం) చర్యలను చూస్తుంటే ఇది 'బలవంతపు సమాఖ్య' అని అనిపిస్తోంది. నిజంగా 'సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌' జరుగుతోందా? నాకైతే అలా అనిపించడంలేదు." - కేటీఆర్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి

'రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం వల్లే దేశం సమాఖ్య స్ఫూర్తిని కోల్పోతుంది'

ఇవీ చదవండి: త్వరలోనే గిరిజన బంధు పథకం.. నా చేతులతోనే ప్రారంభిస్తా: సీఎం కేసీఆర్

మాంగల్య ధారణ.. మెట్టెల సవ్వడి.. హిందూ సంప్రదాయంలో ఒక్కటైన మెక్సికన్​ జంట​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.