KTR Counter to DK Shivakumar : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కర్ణాటకలో ప్రజలు అంధకారంలో ఉన్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించగా.. శనివారం కాంగ్రెస్ బస్సు యాత్రలో స్ఫందించిన కర్ణాటక ఉపముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) ఒకసారి తమ రాష్ట్రానికి రావాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించారు.
DK Shivakumar VS KTR : కాంగ్రెస్ వైఫల్యాలను చూడటానికి కర్ణాటక దాకా వెళ్లాల్సిన అవసరం లేదని.. వారి చేతిలో దగా పడ్డ రైతులే తెలంగాణకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారని కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. ఓవైపు ఆ రాష్ట్ర ప్రజలు పుట్టెడు కష్టాలతో పడరాని పాట్లు పడుతుంటే పట్టించుకోకుండా.. తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా అని ప్రశ్నించారు. హస్తం పార్టీకి అధికారం ఇస్తే.. అంధకారమే అని కర్ణాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
KTR Fires on Congress : 'రాహుల్, రేవంత్ లాంటి వాళ్లుంటారని గాంధీజీ ఆనాడే ఊహించారేమో..?'
KTR Comments On Congress : ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన మిమ్మల్ని.. కర్ణాటక ప్రజలు క్షమించరని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు సైతం హస్తం పార్టీని విశ్వసించరని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఐదు హామీల పేరిట అరచేతిలో వైకుంఠం చూపించి.. తీరా గద్దెనెక్కిన తర్వాత సవాలక్ష కొర్రీలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. గృహజ్యోతి పథకం గాలిలో దీపంలా ఆరిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. ఎడాపెడా కరెంట్ కోతలు.. ఛార్జీల వాతలతో కర్ణాటక (Karnataka) చీకటిరాజ్యంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. కనీసం ఐదు గంటలు కూడా విద్యుత్ లేక అక్కడి రైతులే కాక.. రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఎడాపెడా పవర్ కట్‌లతో వాణిజ్య, వ్యాపార సంస్థలు కూడా కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. అన్నభాగ్య స్కీమ్ పూర్తిగా అటకెక్కిందని విమర్శించారు. రేషన్‌పై కూడా సన్నబియ్యం ఇవ్వాలన్న బీఆర్ఎస్ సంకల్పానికి.. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేని కాంగ్రెస్ అసమర్థ పాలనకు ఉన్న తేడాను.. తెలంగాణ సమాజం స్పష్టంగా అర్ధం చేసుకుందని కేసీఆర్ అన్నారు.
KTR Comments on Congress Today : 'ఇంటింటికి తాగునీరు.. 24 గంటల విద్యుత్ ఆపేయమంటారేమో?'
KTR Tweet Today : మహిళలకు ఉచిత ప్రయాణం అని మభ్యపెట్టి మొత్తానికే కర్ణాటక ఆర్టీసీని దివాళా తీసిన విధానం ప్రజలకే కాదని.. అక్కడి ఉద్యోగులకు కూడా పెను ప్రమాదంగా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. సబ్ స్టేషన్ల వద్ద మొసళ్లతో నిరసనలు.. కరెంట్ కోసం పురుగుల మందు తాగి రైతుల ఆత్మహత్య ప్రయత్నాలన్నీ హస్తం పార్టీ ఘోర వైఫల్యాలకు సజీవ సాక్ష్యాలని వ్యాఖ్యానించారు. మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్న మీ గృహలక్ష్మి హామీకి కూడా గ్రహణం పట్టిందని కేటీఆర్ ఆక్షేపించారు.
KTR Tweet on Congress Failures in Karnataka : ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్న ప్రధాని హామీలాగే మీ హామీ కూడా గంగలో కలిసిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. కర్ణాటకలో అధికారంలోకి రాగానే కమీషన్ల కుంభమేళాకు తెర తీసిన కాంగ్రెస్ అవినీతి బాగోతాన్ని చూసి తెలంగాణ సమాజం మండిపడుతోందని చెప్పారు. కర్ణాటకలో సకల రంగాల్లో సంక్షోభానికి తెరతీసిన కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవడానికి.. ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. ఎందుకంటే.. ఇది తెలంగాణ గడ్డ.. చైతన్యానికి అడ్డా అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
-
డీకే గారు...
— KTR (@KTRBRS) October 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
కాంగ్రెస్ కు అధికారం ఇస్తే.. అంధకారమే అని కర్ణాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది.
దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణకు వచ్చి... కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. అది…
">డీకే గారు...
— KTR (@KTRBRS) October 29, 2023
కాంగ్రెస్ కు అధికారం ఇస్తే.. అంధకారమే అని కర్ణాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది.
దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణకు వచ్చి... కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. అది…డీకే గారు...
— KTR (@KTRBRS) October 29, 2023
కాంగ్రెస్ కు అధికారం ఇస్తే.. అంధకారమే అని కర్ణాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది.
దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణకు వచ్చి... కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. అది…