పార్లమెంటు ఎన్నికల్లో తెరాస వైఖరేంటో చెప్పి ఓట్లు అడగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఉచిత విద్యుత్ అమలు చేసిన ప్రభుత్వం తమదేనని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హెచ్ తెలిపారు. మోదీకి మద్దతు ఇచ్చేందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో రాష్ట్రాల పర్యటన చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎక్కువ మంది ఎంపీలున్న తెరాస విభజన హామీలను ఎందుకు నెరవేర్చుకోలేకపోయిందని ప్రశ్నించారు. హరిత విప్లవం ద్వారా దేశంలో ఆహార కొరత లేకుండా చేశామని సీనియర్ నేత మల్లు రవి పేర్కొన్నారు.
ఇవీ చదవండి :130 కోట్ల మంది ప్రజలే సాక్ష్యం