ETV Bharat / state

బండి సంజయ్​ పాదయాత్రను అడ్డుకోవాల్సిన కర్మ మాకు పట్టలేదు: కేటీఆర్​

KTR on Sanjay Padayatra: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏం మొహం పెట్టుకొని పాలమూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు ఘాటుగా వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం ఇస్తామంటున్న బండి సంజయ్... కేంద్రంలోని భాజపా సర్కారు దేశవ్యాప్తంగా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. తెరాసతో పొత్తు ఉండదన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాకూర్ వ్యాఖ్యపై స్పందిస్తూ పొత్తు ఎవరడిగారన్నారు. ఈనెల 27న జరగనున్న తెరాస ప్లీనరీ కోసం పార్టీ కమిటీలను కేటీఆర్ ప్రకటించారు.

బండి సంజయ్​ పాదయాత్రను అడ్డుకోవాల్సిన ఖర్మ మాకు పట్టలేదు: కేటీఆర్​

author img

By

Published : Apr 18, 2022, 7:21 PM IST

Updated : Apr 19, 2022, 6:13 AM IST

KTR on Sanjay Padayatra: బండి సంజయ్ మహబూబ్​నగర్ జిల్లాలో పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు డిమాండ్ చేశారు. ఆయన పాదయాత్రను అడ్డుకోవాల్సిన కర్మ తమకు పట్టలేదని చెప్పారు. ఏ ముఖం పెట్టుకొని పాలమూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించిన కేటీఆర్... పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని చెప్పేందుకా.. నదీ జలాల్లో వాటా తేల్చకుండా తాత్సారం చేస్తున్నందుకా... అని ప్రశ్నించారు. బండి సంజయ్ ప్రసంగాల్లో మత విద్యేషాలు రెచ్చగొట్టడం, అబద్దాలు తప్ప ఇంకేం లేవన్నారు. అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం ఇస్తామంటున్న బండి సంజయ్.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం ఇస్తామంటే మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

కర్ణాటకకు వెళ్లి తెలుసుకోండి: రాష్ట్రంలో పాలనపై విమర్శలు చేస్తున్న బండి సంజయ్‌.. పక్కనే భాజపా అధికారంలో ఉన్న కర్ణాటక వెళ్లి ప్రభుత్వ పనితీరు తెలుసుకోవాలని కేటీఆర్‌ హితవు పలికారు. కావాలంటే ఏసీ కార్లు పెట్టి పంపిస్తామని.. అక్కడికి వెళ్లి పాలన చూసి సిగ్గు తెచ్చుకోవాలన్నారు. కర్ణాటకలో మంత్రులు 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నారంటూ కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. భాజపా అధికారంలో ఉన్న గుజరాత్‌లో విద్యుత్‌ కోసం రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. అక్కడ పవర్‌ హాలిడేలు కూడా ఇస్తుంటే ఎవరి కోసం బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణలో ఆలయాల అభివృద్ధికైనా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందా అని కేటీఆర్‌ నిలదీశారు. జోగులాంబ, భద్రాద్రి, వేములవాడ.. ఇలా ఏ ఆలయానికైనా నిధులు ఇచ్చారా? అని మండిపడ్డారు. పనికిమాలిన కూతలు మాని ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మీరు అమలు చేస్తామంటే మేం వద్దంటున్నామా?: రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని భాజపా నేతలు చెబుతున్నారని.. కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరని కేటీఆర్‌ ప్రశ్నించారు. దేశమంతా ఉచిత విద్య, వైద్యం అమలు చేస్తామంటే తాము వద్దంటున్నామా? అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై భాజపాకు దమ్ముంటే పార్లమెంట్‌లో చట్టం చేయాలని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. పార్లమెంట్‌లో చట్టం తీసుకొస్తే తాము మద్దతిస్తామని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వడం లేదని.. పక్కనే కర్ణాటకలో ఉన్న అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు ఇచ్చారన్నారు. భాజపా పాలిత రాష్ట్రాలకు రూ.వేల కోట్లు ఇచ్చి సహకరిస్తున్నారని.. ఇక్కడ నీతి ఆయోగ్‌ చెప్పినా ఇవ్వడం లేదనే పాదయాత్ర చేస్తున్నారా? అని బండి సంజయ్‌ను ఉద్దేశించి కేటీఆర్ దుయ్యబట్టారు. తెరాస 21వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా జరపాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెరాసతో పొత్తు ఉండదని కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ వ్యాఖ్యలపై విలేకరులు అడగ్గా.. పొత్తు ఎవరడిగారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కర్ణాటకలో మంత్రులకు కమీషన్లు ఇవ్వనిదే పనులు కావట్లేదని కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. గుజరాత్​లో కూడా పవర్​ హాలీడేలు ఇస్తుంటే నువ్వు ఎవరి కోసం పాదయాత్ర చేస్తున్నవు. మమ్మల్ని తెలంగాణలో కలపాలని భాజపా ఎమ్మెల్యే విజ్ఞప్తి చేస్తున్నారు. నీ పాదయాత్రను అడ్డుకునే కర్మ మాకు లేదు. ఏ ముఖం పెట్టుకుని చేస్తున్నడు పాదయాత్ర. మేం పక్కనే ఉన్న పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వం.. కర్ణాటకలో అప్పర్​భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తాం అని చెప్పుకుంటూ తిరుగుతున్నావా. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని చెప్పేందుకా.. నదీ జలాల్లో వాటా తేల్చకుండా తాత్సారం చేస్తున్నందుకా.. పాదయాత్ర చేసేది. -కేటీఆర్​

ఇవీ చదవండి:

Last Updated : Apr 19, 2022, 6:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.