KTR On Crop Damage: రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అన్నదాతలు ఎటువంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల కర్షకులకు ఎదురవుతున్న ఇబ్బందుల పట్ల కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Crop Damage in Telangana : ఈ కష్టకాలంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా రైతులకు భరోసా ఇవ్వాలని.. స్ధానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని కేటీఆర్ కోరారు. అన్నదాతలు ఆందోళన చెందవద్దని.. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని అభయమిచ్చారు. ఇందులో భాగంగానే ఈ మధ్యనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పంటలన్నీ అతలాకుతలమవుతున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులకు ఫోన్ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లా వ్యాప్తంగా పంట నష్టంపై వివరాలు అందించాలని సూచించారు.
'ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు.. రైతులకు భరోసా ఇవ్వాలి. అన్నదాతలు ఆందోళన చెందవద్దు ప్రభుత్వం అండగా ఉంటుంది. రైతుల పట్ల అత్యంత సానుకూలంగా ఉండే రైతు ప్రభుత్వమిది. రానున్న రెండ్రోజులు భారీ వర్ష సూచన ఉంది. అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి.' - కేటీఆర్, మంత్రి
KTR Assurance to Farmers on Crop Damage : రాష్ట్రంలో పలు జిల్లాలో నిన్న రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఫలితంగా ధాన్యం తడిసిముద్దవుతోంది. ఈ క్రమంలోనే కొన్నిచోట్ల కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కొట్టుకుపోయింది. ఈదురుగాలులు, వడగళ్ల వాన బీభత్సానికి వరి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. పలుచోట్ల మామిడి, ఇతర కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు కురవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు. ఈ క్రమంలోనే వివిధ పార్టీలు క్షేత్రస్థాయిలో పర్యటించారు. నష్టపోయిన రైతులను పరామర్శించారు. వారికి అండంగా ఉంటామని భరోసా కల్పించారు. బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: Maize Price Down: అకాల వర్షానికి మొక్కజొన్న రైతులు అతలాకుతలం
Hyderabad Rains : నగరంలో రికార్డు స్థాయి వర్షం.. హుస్సేన్‌సాగర్‌లో తప్పిన ప్రమాదం
తెలుగు ప్రజల ఓటే శాసనం.. కర్ణాటకలో 12 జిల్లాల్లో ప్రభావం.. మద్దతు ఎవరికో?