ETV Bharat / state

తెలంగాణ ఎలక్ట్రిక్ హబ్​గా మారుతోంది: కేటీఆర్ - brand hyderabad 2020

అమెజాన్ హైదరాబాద్‌కు వచ్చేందుకు అధికారులు ఎంతగానో కృషిచేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఎలక్ట్రిక్ హబ్‌గా మారుతోందని వెల్లడించారు. డీకార్బనైజేషన్, డిజిటలైజేషన్, డీసెంట్రలైజేషన్.. ఈ మూడు 'డి'లదే భవిష్యత్‌ అంతా అని మంత్రి పేర్కొన్నారు.

ktr-about-sources-in-hyderabad-for-start-up-companies
తెలంగాణ ఎలక్ట్రిక్ హబ్​గా మారుతోంది: కేటీఆర్
author img

By

Published : Nov 22, 2020, 2:05 PM IST

తెలంగాణ ప్రభుత్వ పన్ను విధానలు నచ్చి అమెజాన్‌ హైదరాబాద్‌కు వచ్చింది. అమెజాన్‌ అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్‌లోనే ఉంది. అమెజాన్‌ హైదరాబాద్‌కు వచ్చేందుకు అధికారులు ఎంతో కృషి చేశారు. ఐటీ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపింది. కేవలం ఆరేళ్లలోనే తెలంగాణ స్టార్టప్‌ల పాలిట స్వర్గధామంగా మారింది.

''తెలంగాణ ఎలక్ట్రిక్‌ హబ్‌గా మారుతోంది. ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ రంగాల్లోనూ రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో నిలబెడతాం. అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్‌ క్యాబిన్‌ హైదరాబాద్‌లోనే తయారైంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలోనూ తెలంగాణ ముందువరుసలో ఉంది. జిల్లాల్లో ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఏరోస్పేస్‌ రంగంలో తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఐటీ, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లోనూ హైదరాబాద్‌ సత్తా చాటింది. రాబోయే రెండు దశాబ్దాల్లో ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలో మంచి భవిష్యత్తు ఉంది.''

-మంత్రి కేటీఆర్

తెలంగాణ ఎలక్ట్రిక్ హబ్​గా మారుతోంది: కేటీఆర్

హెల్త్‌కేర్‌ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో అవకాశం ఉందని మంత్రి అన్నారు. డీకార్బనైజేషన్‌, డిజిటలైజేషన్‌, డీసెంట్రలైజేషన్‌.. ఈ మూడు 'డి'’లదే భవిష్యత్‌ అంతా’ అని కేటీఆర్ వివరించారు.

ఇదీ చూడండి: ప్రపంచంలోనే సురక్షితమైన నగరం హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.