KRMB Meeting: ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ ఎర్రమంజిల్ జలమండలి కార్యాలయంలో కృష్ణా నదీ యాజమాన్య మండలి సమావేశం జరగనుంది. తెలంగాణ రాష్ట్రం తరఫున కొన్ని అంశాలను నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్‌కుమార్ ప్రతిపాదించారు. ఈ మేరకు కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు ఆయన లేఖ రాశారు. 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాలు వాడుకుంటే... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుంచి 34 టీసీఎంల నీరు మాత్రమే తీసుకునేలా పరిమితం చేయాలని తెలంగాణ ప్రతిపాదించింది. రాష్ట్ర రైతులు, ప్రజల అవసరాల రీత్యా 50 శాతం కృష్ణా జలాల వాటా ఇప్పటికే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేఆర్‌ఎంబీని అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో ఆయా అంశాలు శుక్రవారం జరగబోయే బోర్డు సమావేశంలో విస్తృతంగా చర్చించాలని ఆయన సూచించారు.
ఇవీ చదవండి: