KRMB Reservoirs Committee: విద్యుత్ ఉత్పత్తి, వరదనీటి అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జలాశయాల నిర్వహణా కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవలి కేఆర్ఎంబీ సమావేశ నిర్ణయానికి అనుగుణంగా ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. మూడు అంశాలపై కమిటీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
శ్రీశైలం, నాగార్జునసాగర్ పవర్ హౌజెస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం 15 రోజుల్లోగా విధివిధానాలు ఖరారు చేయాలి. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల రూల్ కర్వ్స్ ముసాయిదాను పరిశీలించి నెల రోజుల్లోగా సిఫారసులు అందించాలి. 75 శాతం లభ్యతకు పైబడి వరద జలాల వినియోగానికి నెల రోజుల్లో విధివిధానాలు రూపొందించాలి. కమిటీ ఇచ్చే సిఫారసులు, నివేదికను బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
ఇవీ చూడండి: Asani Cyclone effect on Trains: అసని తుపాను ఎఫెక్ట్.. భారీగా రైళ్లు రద్దు