KRMB Meeting : 2023 జనవరి 6న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మేరకు సమావేశ తేదీని ప్రతిపాదించిన బోర్డు.. రెండు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి బోర్డు సభ్య కార్యదర్శి రాయిపురే నోటీసు ఇచ్చారు. సమావేశం కోసం అజెండా అంశాలను ఇవ్వాలని రెండు రాష్ట్రాలను కోరారు. రాష్ట్రాల తరఫున ఏవైనా అంశాలుంటే సమావేశంలో చర్చించేందుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
బోర్డు నిర్వహణ, నిధులు, గెజిట్ నోటిఫికేషన్ అమలు.. ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణ, జల విద్యుత్ ఉత్పత్తి, రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటా, అనుమతుల్లేని ప్రాజెక్టులు.. మిగులు జలాలు, పరస్పర ఫిర్యాదులు, తదితర అంశాలు కృష్ణా బోర్డు సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: అమ్మాయితో మాట్లాడేందుకే కిడ్నాప్ చేశా: నవీన్‌రెడ్డి
'పదేళ్లు గడిచినా.. నాటి పరిస్థితులే నేటికీ'.. నిర్భయ తల్లిదండ్రుల ఆవేదన