ETV Bharat / state

KRISHNA BOARD: జలజగడం తీవ్రం... రంగంలోకి కృష్ణా యాజమాన్య బోర్డు - telangana varthalu

తెలుగురాష్ట్రాల మధ్య జల వివాదం తీవ్రమైన నేపథ్యంలో కృష్ణా యాజమాన్యం బోర్డు రంగంలోకి దిగింది. ఈనెల 9న సమావేశం జరపాలని నిర్ణయించిన బోర్డు.. విద్యుదుత్పత్తి ద్వారా నీటి విడుదలపైనా భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. తాజా పరిస్థితిని కేంద్రం దృష్టికి యాజమాన్య బోర్డు తీసుకెళ్లింది.

KRISHNA BOARD: జలజగడం తీవ్రం... రంగంలోకి కృష్ణా యాజమాన్య బోర్డు

author img

By

Published : Jul 3, 2021, 2:45 AM IST

కృష్ణా ప్రాజెక్టులపై తెలుగురాష్ట్రాల మధ్య జలజగడాలు మరింత తీవ్రం కావడంతో...పరిష్కారం దిశగా కృష్ణా యాజమాన్య బోర్డు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈనెల 9న ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది. వివిధ అంశాలపై తలెత్తే వివాదాలను ఎప్పటికపుడు పరిష్కరించుకునేందుకు రెండు రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌చీఫ్‌లు, బోర్డు కార్యదర్శితో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ 9న సమావేశమై చర్చించనుంది. ప్రాజెక్టుల వారీగా నీటి అవసరాలను పంపాలని రెండురాష్ట్రాల ఈఎన్సీలను బోర్డు కోరినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. విద్యుదుత్పత్తి ద్వారా నీటి విడుదలపైనా ఆ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఆ భేటీకి ముందుగానే బోర్డు కొత్త ఛైర్మన్‌ ఎం.పి.సింగ్‌ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.

తాజా పరిస్థితి కేంద్రం దృష్టికి..

కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి, రాయలసీమ ఎత్తిపోతల పర్యటన సహా రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్న పలు అంశాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. శ్రీశైలంతోపాటు నాగార్జునసాగర్‌, పులిచింతలలో తెలంగాణ విద్యుదుత్పత్తి చేపట్టడం, ఆ విషయంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ ప్రధానమంత్రికి, కేంద్ర జల్‌శక్తి మంత్రికి లేఖ రాసిన తరుణంలో తాజాపరిస్థితిని వివరిస్తూ యాజమాన్య బోర్డు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. శ్రీశైలంలో విద్యుదుత్పత్తిపై కొద్ది రోజులు క్రితం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ లేఖ రాయగా.. నిలిపివేయాలని తెలంగాణకు యాజమాన్య బోర్డు లేఖ రాసింది. తెలంగాణ విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్న విషయాన్ని కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ప్రస్తుతం మరోసారి తాజా పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు ఈనెల 12లోగా నివేదిక ఇవ్వాల్సి ఉందని.. ఐతే ఆంధ్రప్రదేశ్‌ సహకరించడం లేదని నివేదించినట్లు సమాచారం. రాయలసీమ ఎత్తిపోతల పర్యటనకు నియమించిన కమిటీపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసిందని పేర్కొంది. గోదావరి నుంచి మళ్లించే నీటిలో వాటా తేల్చడంపై. గతంలో నియమించిన బజాజ్‌ కమిటీ ఏం తేల్చకుండానే కాలపరిమితి ముగియడం, ఇతర పెండింగ్‌ అంశాలన్నింటినీ సమగ్రంగా కేంద్రం దృష్టికి కృష్ణా యాజమాన్య బోర్డు తీసుకెళ్లినట్లు తెలిసింది.

ఇదీ చదవండి: TS-AP WATER WAR: 'ఆ రెండు ప్రాజెక్టుల్లో నిరంతరంగా జల విద్యుత్​ ఉత్పత్తి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.