ETV Bharat / state

సామాన్యుడికి షాక్​..ఇంటికి రూ.1.4 లక్షల విద్యుత్​ బిల్లు

ఏపీ విశాఖ మన్యం పాడేరు పట్టణ శివారులో నివాసముంటున్న గిరిజనుడు కృష్ణారావు ఇంటికి రూ. లక్షకుపైగా విద్యుత్ బిల్లు రావడం వల్ల బాధితుడు లబోదిబోమంటున్నాడు. ఈ విషయంలో తనకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాడు.

సామాన్యుడికి షాక్​..ఇంటికి రూ.1.4 లక్షల విద్యుత్​ బిల్లు
సామాన్యుడికి షాక్​..ఇంటికి రూ.1.4 లక్షల విద్యుత్​ బిల్లు
author img

By

Published : Oct 10, 2020, 8:21 PM IST

ఓ పేద గిరిజన రైతు తన ఇంటి విద్యుత్ బిల్లు లక్షల్లో రావడం వల్ల లబోదిబోమంటున్నాడు. ఏడాది కాలం నుంచి తన బిల్లులో మార్పు లేదని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా పాడేరు సిల్వర్ కాలనీలో కృష్ణారావు అనే ఆదివాసీ గిరిజన తెగకు చెందిన వ్యక్తి నివాసం ఉంటున్నాడు. నవంబర్‌లో ఆయన ఉంటున్న ఇంటికి రూ.1,39,848 బిల్లు రాగా విద్యుత్​ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. అప్పటినుంచి మీటరు రద్దు చేశారన్నాడు. అంతకుముందు తరచూ రూ.500 వరకు బిల్లు వస్తుండేదన్నాడు.

krishna-rao-a-tribal-man-living-in-the-suburbs-of-paderu-had-an-electricity-bill-of-over-rs-1-lakh
బాధితుడికి వచ్చిన విద్యుత్​ బిల్లు

ఈ క్రమంలో ఈ నెలలో మరోసారి రూ.1,40,248 బిల్లు వచ్చిందని కృష్ణారావు వాపోయాడు. తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండు నోటీసు సైతం జారీ చేసినట్లు తెలిపాడు. ఈ విషయంలో తనకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవోకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పాడేరు గిరిజన ప్రాంతంలో వెనుకబడిన గిరిజనులకు 50 యూనిట్ల వరకు విద్యుత్​ ఉచితంగా ఉంటుందని.. కానీ లక్షల్లో బిల్లు రావడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి: ఈటీవీ భారత్ ఎఫెక్ట్: రూ. 850కి తగ్గిన విద్యుత్ బిల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.