రేపు రాయలసీమ ఎత్తిపోతల పర్యటనకు కృష్ణా బోర్డు బృందం వెళ్లనుంది. ఎత్తిపోతల పథకం పనులను తనిఖీకి చేయనుంది. తెలుగు అధికారులు ఎవరూ లేకుండా పర్యటించాలని ఎన్జీటీ ఆదేశంతో బృందం పర్యటించనుంది. తెలంగాణ అధికారి ఉండకూడదని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీలో పిటిషన్ వేసింది. తనిఖీ బృందంలో సీడబ్ల్యూసీలో పనిచేస్తున్న దేవేందర్‌రావు పేరును చేర్చడంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్జీటీ.. తెలుగు వ్యక్తులు లేకుండా వెళ్లాలని కృష్ణా బోర్డును ఆదేశించింది. ఈనెల 9న నివేదిక అందజేయాలని స్పష్టం చేసంది.
ఇదీ చదవండి: CJI JUSTICE NV RAMANA: 'కృష్ణా నదీ జలాల పిటిషన్‌పై నేను విచారణ చేపట్టను'