కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈ నెల 27వ తేదీన సమావేశం కానుంది. బోర్డు ఛైర్మన్ అధ్యక్షతన ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్ ఇన్ చీఫ్‌లతో పాటు ఇతర ఇంజినీర్లు సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మేరకు బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం రెండు రాష్ట్రాలకు సమాచారం అందించారు. ప్రస్తుత సంవత్సరంలో రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు, బోర్డుకు నిధులు, ఆంధ్రప్రదేశ్‌కు బోర్డు తరలింపు, నిర్వహణ విధివిధానాలపై సమావేశంలో చర్చించనున్నారు.
ఇవీ చూడండి: తహసీల్దార్ విజయారెడ్డి హత్య వెనుక ఎవరి ప్రమేయం ఉంది?