తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి నీరు విడుదల చేయాలన్న ఏపీ విజ్ఞప్తిపై సమ్మతి తెలపాలని రాష్ట్రాన్ని కృష్ణానదీ యాజమాన్య బోర్డు కోరింది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి రాయిపురే ఈఎన్సీకి లేఖ రాశారు. ఈ నెల 9న వర్చువల్ విధానంలో జరిగిన బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో సాగర్లో 808 అడుగుల దిగువకు నీటిని వినియోగించరాదని నిర్ణయించినట్లు లేఖలో పేర్కొంది.
ఉమ్మడి జలాశయాల్లో కేటాయించిన జలాలన్నింటినీ ఈ నెల 9 నాటికే వినియోగించుకుందని కార్యదర్శి పేర్కొన్నారు. మే నెల తాగునీటి అవసరాల కోసం సాగర్ నుంచి 6 లేదా 7 టీఎంసీల నీరు విడుదల చేయాలని ఏపీ ఈఎన్సీ కోరినట్లు తెలిపారు. సాంకేతిక సమస్యల వల్ల ఆ రోజు చర్చ పూర్తి కాలేదని, ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిని అంగీకరిస్తే నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేస్తామని బోర్డు లేఖలో పేర్కొంది. వీలైనంత త్వరగా సమ్మతి తెలపాలని ఈఎన్సీని బోర్డు కోరింది.
ఇదీ చదవండి: ఉదయాన్నే మజ్జిగ తాగండి.. వేసవి తాపం తగ్గించుకోండి!