ETV Bharat / state

బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు కృష్ణా బేసిన్‌ వివాదాంశాలు

author img

By

Published : Oct 25, 2020, 7:16 AM IST

కృష్ణా బేసిన్‌లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న పలు అంశాలను బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు పంపాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సూచించింది. కృష్ణా బోర్డు సమావేశాల్లో చర్చించినా పరిష్కారం కాని పలు అంశాలపై అభిప్రాయాన్ని కోరింది.

krishna basin problems to brijesh kumar tribunal
బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు కృష్ణా బేసిన్‌ వివాదాంశాలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న పలు అంశాలను బ్రిజేష్​కుమార్​ ట్రైబ్యునల్​కు పంపాలని సీడబ్ల్యూసీ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సూచించింది. ఒక సంవత్సరంలో కేటాయించి వాడుకోలేని నీటిని తర్వాత సంవత్సరంలో వినియోగించుకోవడం తదితర అంశాలు వివాదాస్పదంగా ఉన్నాయి. హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు వినియోగించుకొనే నీటిలో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకొని లెక్కగట్టడం, గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే నీటిలో వాటా విషయంలోనూ వివాదాలు ఉన్నాయి.

క్యారీఓవర్‌పై: 2019- 20వ నీటి సంవత్సరానికి కేటాయించిన నీటిలో 50 టీఎంసీలు వినియోగించుకోలేకపోయామని, ఈ నీటిని 2020- 21వ నీటి సంవత్సరంలో వాడుకోవడానికి అనుమతించాలని తెలంగాణ కోరింది. బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకారం ఇలా క్యారీఓవర్‌కు అవకాశం ఉందని పేర్కొంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌ అంగీకరించలేదు. దీంతో బోర్డు కేంద్ర జలసంఘం అభిప్రాయాన్ని కోరింది. దిగువన ఉన్న రాష్ట్రానికి క్యారీఓవర్‌కు బచావత్‌ ట్రైబ్యునల్‌ అవకాశం కల్పించింది. పునర్విభజన తర్వాత రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డాక తెలంగాణ దిగువ రాష్ట్రం కాదు కాబట్టి బచావత్‌ ట్రైబ్యునల్‌ వర్తించదు. రెండు రాష్ట్రాలు పరస్పరం మాట్లాడుకొని ఒక అభిప్రాయానికి రావాలని లేదా ట్రైబ్యునల్‌కు అప్పగించి శాశ్వత పరిష్కారం పొందాలని జలసంఘం సూచించింది.

హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు వాడే నీటిపై: హైదరాబాద్‌లో వినియోగించే నీరు పునరుత్పత్తి ద్వారా తిరిగి నదిలోకి చేరుతుందని, వినియోగించే నీటిలో 20 శాతాన్ని మాత్రమే లెక్కల్లోకి తీసుకోవాలని తెలంగాణ కోరింది. 17 టీఎంసీల నీటిని తీసుకొంటే ఇందులో 20 శాతం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ఆధారంగానే దీనిని కోరింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ అంగీకరించలేదు. జూన్‌ 4న జరిగిన బోర్డు సమావేశంలో కేంద్ర జల సంఘం అభిప్రాయం కోరాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాలు ఓ అభిప్రాయానికి రాకపోతే ట్రైబ్యునల్‌కు అప్పగించాలని జల సంఘం సూచించింది.

గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే నీటిలో వాటాపై: ప్రకాశం బ్యారేజి ద్వారా కృష్ణా డెల్టాలో వినియోగించుకొనే 80 టీఎంసీలను సాగర్‌ నుంచి విడుదల చేయకుండా మినహాయిస్తారు. ఇందులో 35 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్రలకు; 45 టీఎంసీలు సాగర్‌ పైభాగంలోని ప్రాజెక్టులకు వినియోగించుకోవాలని ఉంది. సాగర్‌పైన కృష్ణా బేసిన్‌లో ఉన్నది తమ ప్రాజెక్టులే కాబట్టి ఈ నీటిని తమకు ఇవ్వాలని తెలంగాణ కోరింది. దీనిపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ బజాజ్‌ కమిటీని నియమించింది. నివేదిక ఇవ్వకుండానే కమిటీ గడువు ముగిసింది. ఈ అంశాన్ని ట్రైబ్యునల్‌కు అప్పగించాలని సీడబ్ల్యూసీ సూచించింది.

వరద సమయంలో వినియోగించుకొనే మిగులు జలాలను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొనగా, ఇందుకు తెలంగాణ అంగీకరించలేదు. ఎంత తీసుకొన్నది లెక్క ఉండాలని పేర్కొంది. దీనిపై కూడా జలసంఘం అభిప్రాయం చెప్పినట్లు తెలిసింది.

నవంబరు 25 నుంచి బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ విచారణ...

కృష్ణా జలాల వివాదాన్ని విచారిస్తున్న బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. సుమారు ఏడాదికి పైగా ఎలాంటి విచారణలు లేవు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గి నేరుగా వాదనలు వినేందుకు పరిస్థితులు అనుకూలిస్తున్నందున నవంబరు 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు విచారణ జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సమాచారం ఇచ్చింది. ఏపీ పునర్విభజన చట్టం మేరకు బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ గడువు పొడిగించగా... రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వారీ కేటాయింపు, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు వినియోగం ఎలా అన్నదానిపై విచారణ జరుపుతుంది.

ఇదీ చదవండి- రాష్ట్ర ప్రజలకు సీఎం విజయదశమి శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.