KP Chaudhary drug case latest news : తెలుగు సినీ చిత్ర పరిశ్రమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన కబాలీ మూవీ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. రిమాండ్ రిపోర్టులో 12మంది పేర్లను పేర్కొన్న పోలీసులు.. వాళ్ల గురించి ఆరా తీస్తున్నారు. కేపీ చౌదరి నిర్వహించిన పార్టీలో మాదకద్రవ్యాలు సేకరించినట్లు గుర్తించిన పోలీసులు, తగిన ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు సామాజిక మాధ్యమాల్లో ఆ వార్తలను ఖండిస్తున్నారు.
- Kabali Producer Drugs Case Update : కేపీ చౌదరి డ్రగ్స్ కేసు.. 'టాలీవుడ్'లో టెన్షన్.. టెన్షన్..!
- Kabali Producer Drugs Case Update : కేపీ చౌదరి కాల్ లిస్ట్‌లో అషూరెడ్డి నంబర్.. స్పందించిన నటి
ఇప్పటికే కేపీ చౌదరి గూగుల్ డ్రైవ్ నుంచి పలు ఫోటోలతో పాటు కీలక సమాచారం సేకరించిన పోలీసులు, వాటిని విశ్లేషిస్తున్నారు. రిమాండ్ రిపోర్టులోని పలు అంశాలు బయటికి రావడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఆయా అంశాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఖండిస్తున్నారు. సినీ రంగానికి చెందిన ముగ్గురు వ్యక్తుల పేర్లు సైతం బయటికి వచ్చాయి. సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు కుటంబానికి సంబంధించిన విషయాలను మాత్రమే కేపీ చౌదరితే మాట్లాడే వాళ్లమని.. మాదక ద్రవ్యాలతో అసలు సంబంధమే లేదని ముగ్గురూ ఖండించారు.
KP Chaudhary drug case remand report : పోలీసులు మాత్రం కేపీ చౌదరీ కాల్ డేటాతో పాటు... ఆయన బ్యాంకు ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ఇందులో ఎవరెవెరికి సంబంధం ఉందనే కోణంలో ఆరా తీస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీసులు పలువురికి నోటీసులు జారీ చేసి పిలిచి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కొన్ని ఛానల్స్‌పై పరువు నష్టం దావా వేస్తా..: ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి అషూ రెడ్డి స్పందించారు. దీనిపై ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. తన ఫోన్ నంబర్‌ను టీవీ ఛానెళ్లు ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తాజాగా ఆమె మరోసారి దీనిపై వీడియోను పోస్టు చేశారు. కొన్ని మీడియా ఛానెళ్లు తనను కించపరిచే విధంగా వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. తన ఫోన్ నెంబర్‌తో పాటు వ్యక్తిగత వివరాలను ప్రసారం చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కొన్ని మీడియా ఛానల్స్‌పై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు.
ఇదే వ్యవహారంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి సురేఖ వాణి, మరో నటి జ్యోతి సైతం స్పందించారు. తమపై కొందరు అనవసరంగా ద్రుష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేపీ చౌదరితో సినిమా, కుటుంబ పరిచయాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఇలాంటి ఆరోపణలు వలన తమ కుటుంబం పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీనిపై విచారణకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
ఇవీ చదవండి: