కోఠి మహిళల కళాశాలలో పునరుద్ధరణ పనులను పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పరిశీలించారు. ప్రపంచ స్మారక నిధి, ఇతర దాతల సహకారంతో కళాశాలలో పలు పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఆయనతో పాటు ప్రపంచ స్మారక కట్టడాల నుంచి డెక్కన్ హెరిటేజ్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు, ధర్మకర్త డాక్టర్ హెలెన్ ఫిలోన్, ట్రస్టీ స్టీఫేన్ బ్లాక్ సలోజ్ ఉన్నారు.
పునరుద్ధరణ ప్రాజెక్టులో పనిచేస్తున్న వాస్తు శిల్పులను చారిత్రాత్మక గేట్‌వేల పునరుద్ధరణ ప్రతిపాదనలను సమర్పించాలని అరవింద్ కుమార్ సూచించారు. చారిత్రాత్మక ఉద్యానవనాలను మూసీ నది ఫ్రంట్‌లోకి అనుసంధానించే అవకాశాన్ని అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: తెలుగు విశ్వవిద్యాలయంలో పాటల పండుగ సత్కారం