హైదరాబాద్ కోఠిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన అదనపు 150 పడకల భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్సీ ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్ మమత గుప్తా, డీఎంఈ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎంతో పేరు ప్రఖ్యాతి పొందిన ఆసుపత్రి కోఠి సుల్తానుబజార్ ప్రసూతి ఆసుపత్రి అని.. ఒకేసారి తొమ్మిది కాన్పులకు శస్త్ర చికిత్స జరిగేలా ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి పేర్కొన్నారు. ప్రసావానికి వచ్చే నిరుపేద తల్లులకు కొత్త భవనంలో సదుపాయాలు ఎంతగానో ఉపయోగపడతామని ఈటల తెలిపారు.