ETV Bharat / state

పనుల్లో వేగం.. ప్రారంభం అద్భుతం - konda pochamma sagar reservoir inaugurated

గలగలా గోదావరి తరలి వచ్చింది. కాళేశ్వరం వద్ద నిర్మించిన మేడిగడ్డ నుంచి మొదలైన పరుగు కొండపోచమ్మ సాగర్‌ వరకు సాగింది. ఎల్లంపల్లి నుంచి మధ్య మానేరు మీదుగా రంగనాయకసాగర్‌కు నీటి తరలింపు ఒక ఎత్తు. అక్కడి నుంచి ఏకకాలంలో రెండు పంపుహౌస్‌లను నడిపించి రోజుకు 0.65 టీఎంసీల జలాలను కొండపోచమ్మ సాగర్‌లోకి ఎత్తిపోసే పనులను పూర్తి చేసి ప్రారంభించడం మరొక ఎత్తు.

konda pochamma sagar reservoir construction has done quickly and inaugurated soon
వేగంగా పనులు... గోదారి ఉరకలు...
author img

By

Published : May 30, 2020, 7:11 AM IST

కాళేశ్వరం ప్రాజెక్టు 14వ ప్యాకేజీలోని అక్కారం, మర్కూక్‌ పంపుహౌస్‌లను, కొండపోచమ్మ సాగర్‌ జలాశయాన్ని పలు నిర్మాణ సంస్థలు లక్ష్యం మేరకు పూర్తిచేశాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోనే అత్యంత భారీ సాగు విస్తీర్ణం ఉన్నది ఈ జలాశయం పరిధిలోనే కావడం విశేషం. లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ) వద్ద వంద అడుగుల స్థాయి నుంచి బయలుదేరిన గోదావరి 214 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 618 మీటర్ల ఎత్తుకు చేరుకుంది.

లాక్‌డౌన్‌లో వేగంగా పనులు

వానాకాలం లోపే కొండపోచమ్మ సాగర్‌కు గోదావరి జలాలను తీసుకురావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ, రెండు పంపుహౌస్‌లు నిర్మించిన మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ కలిసికట్టుగా పనులను పరుగెత్తించాయి. విద్యుత్తు మోటార్లు, పంపుహౌస్‌ల్లో సాంకేతిక పనులకు సంబంధించి... ఆన్‌లైన్‌ ద్వారా విదేశాల్లోని నిపుణులను సంప్రదిస్తూ పూర్తిచేశారు. ముంబయి నుంచి రావాల్సిన విద్యుత్తు ఇంజినీర్లను ప్రత్యేక అనుమతుల ద్వారా తీసుకొచ్చి పంపుహౌస్‌ల పనులను పూర్తి చేశారు. జలాశయం పనులను కేఎన్‌ఆర్‌, హెచ్‌ఈఎస్‌ ఇంజినీరింగ్‌ సంస్థలతో పాటు కొన్ని పనులను ఏఎన్‌ఆర్‌ సంస్థ చేపట్టింది.

అక్కారం, మర్కూక్‌ పంపుహౌస్‌ల నిర్మాణ వ్యయం: రూ.2100 కోట్లు

అక్కారం పంపుహౌస్‌

  • మోటార్లు: 6
  • సామర్థ్యం: 162 మెగావాట్లు (27×6)
  • నీటి ఎత్తిపోత సామర్థ్యం: 1250 క్యూసెక్కులు (ఒక మోటారు)
  • రోజుకు తరలింపు: 0.65 టీఎంసీలు
  • మర్కూక్‌ పంపుహౌస్‌

మోటార్లు: 6

  • సామర్థ్యం: 204 మెగావాట్లు (34×6)

ఇవీ చూడండి: మనీ లెండర్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.