Konda Laxman Bapuji Jayanthi Celebrations in Telangana : రాష్ట్ర సాధన, బడుగు, బలహీన వర్గాల చైతన్యం, ఆత్మగౌరవానికి కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) ప్రతీకగా నిలిచారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(CM KCR) అన్నారు. 108 వ జయంతి(Konda Laxman Bapuji 108 Jayanthi) సందర్భంగా ఆయన సేవలు, చేసిన త్యాగాలను సీఎం స్మరించుకున్నారు. హైదరాబాద్‌లోని శాసనసభ ప్రాంగణంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బాపూజీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి అంజలి ఘటించారు.
నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. బాపూజీ త్యాగాలు, సేవలను స్మరించుకున్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన జయంతి వేడుకల్లో మంత్రి గంగుల పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి సత్యవతి రాథోడ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ట్యాంక్ బండ్ జలదృశ్యంలో ఉన్న బాపూజీ విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ పూలమాల వేసి స్మరించుకున్నారు. వరంగల్‌లో ఎమ్మెల్యే నరేందర్‌తో పాటు జిల్లా కలెక్లర్ ప్రావీణ్య నివాళి అర్పించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ తన సొంత ఖర్చులతో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
"జీవితాంతం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం, బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కొరకు పాటుపడిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. మంత్రిగా, బడుగు బలహీన వర్గాలను, ఆయన జిల్లాను ముందుకు తీసుకుపోవడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. 1969లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిననాడు.. మంత్రిగా ఉన్నప్పుడు రాజీనామా చేసిన మొదటి వ్యక్తి. ఆయన జీవితం మొత్తం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనే ఉద్యమించారు. ఎప్పుడు కూడా పదవుల కొరకు ప్రాకులాటలు ఆడలేదు." - గుత్తా సుఖేందర్ రెడ్డి, మండలి ఛైర్మన్
మలిదశ పోరాటానికి ఆద్యుడు కొండా లక్ష్మణ్ బాపూజీ
Acharya Konda Laxman Bapuji Jayanthi 2023 : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఘనంగా జరిగాయి. జలదృశ్యంలో ఉన్న బాపూజీ విగ్రహానికి తెలంగాణ జాగృతి సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల చైతన్యానికి లక్ష్మణ్ బాపూజీ ప్రతీకగా నిలిచారని కొనియాడారు. కలలు కన్న తెలంగాణ రావాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించాల్సిన అవసరం ఉందని కరీంనగర్‌లో బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు.
హనుమకొండ జిల్లా పరకాలలో నిర్వహించిన జయంతి వేడుకల్లో కొండా బాపూజీ మనుమరాలు సంధ్యారాణి అంజలి ఘటించారు. జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమాల్లో ఆచార్య బాపూజీ క్రియాశీలక పాత్ర పోషించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు.
'అవమానకరంగా కూల్చివేసిన చోటే.. ఘనంగా విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం'