MP Komati Reddy Venkat Reddy Meets DK Shivakumar : కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్యనేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఇవాళ బెంగళూరు వెళ్లారు. ప్రధాన కార్యదర్శి అనిరుధ్ రెడ్డితో కలిసి వెళ్లిన ఆయన.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రి బోసురాజులను కలవనున్నారు. అంతే కాకుండా తనకు అపాయింట్‌మెంట్ లభిస్తే.. సీఎం సిద్ధరామయ్యను కూడా కలుస్తానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా తెలంగాణలో నెలకొంటున్న తాజా పరిస్థితులను అక్కడి నేతలకు వివరించనున్నారు.
ఇదే సమయంలో రాష్ట్రంలో చేరికలు, ఇతర పార్టీల నాయకుల చొరవ, తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సొంత గూటికి వచ్చే అవకాశాలపై వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. డీకే శివకుమార్, బోసు రాజులకు తెలంగాణ రాజకీయాల గురించి పూర్తి అవగాహన ఉండటంతో అధిష్ఠానం నిర్ణయం మేరకు తన సోదరుడ్ని తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు సాధ్యసాధ్యాలపై వారితో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరికతోపాటు టికెట్ కూడా ఖరారు కావల్సి ఉండటంతో డీకేతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ వెంకటరెడ్డి మాత్రం ఈ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. తన పర్యటనకు రాజకీయాలకు అసలు సంబంధం లేదని స్పష్టం చేశారు.
- YSRTP Merge in Congress : కాంగ్రెస్‌లో.. వైఎస్ఆర్టీపీ విలీనం కానుందా?
- Bandi Sanjay On Congress And BRS : 'కాంగ్రెస్ నాయకులు గాలిలో కోటలు నిర్మిస్తున్నారు'
Komatireddy Rajagopal Reddy latest news : తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంచి పేరున్న నేతలన్న విషయం తెలిసిందే. మొదటి నుంచి కాంగ్రెస్‌కు విధేయులుగా ఉన్న ఈ ఇరువురిలో.. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక వచ్చింది. రాజగోపాల్ రెడ్డి కమలం గూటికి చేరడంతో తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కాంగ్రెస్ నేతలు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ తరుపున ప్రచారం చేయలేదని.. ఒకనొక సమయంలో వెంకట్‌రెడ్డి పేరు మీద ఆడియో టేపులు బయటకు రావడంతో ఆ వార్తలు మరింత బలపడ్డాయి.
భేటీలో ఈటల అంశం వచ్చేనా..!: గత కొంతకాలంగా మీడియాకు బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా అదే బాటలో వెళ్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి భేటీలో ఈటల అంశం కూడా వస్తుందా అనేది ఆసక్తి కరంగా మారింది.
ఇవీ చదవండి: