హైదరాబాద్ పెద్ద అంబర్‌పేట నుంచి తట్టి అన్నారం వరకు గల రహదారిని పరిశీలించారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ సందర్భంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.5.80 కోట్లతో పనులు చేపట్టేందుకు గత ఏడాది కేటీఆర్ శిలాఫలకం వేశారని...ఇంత వరకు పనులు ఎందుకు చేపట్టలేదని ఎంపీ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇలా ఉత్తుత్తి జీవోలు ఇచ్చారని కోమటిరెడ్డి ఆరోపించారు. ప్రతి అంశంపైన ట్విట్టర్‌లో స్పందించే కేటీఆర్‌కి తట్టి అన్నారం పెద్ద అంబర్‌పేట మధ్య రహదారి గురించి గుర్తులేదా అని నిలదీశారు. రోడ్డు నిర్మాణ పనుల గురించి స్పందించాలని లేని పక్షంలో ఓట్ల కోసం వేసిన శిలాఫలకంగా ఒప్పుకుని ప్రజలకు క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి :'2 లక్షల 25 వేల కోట్ల నిధులు పక్కదారి'