ETV Bharat / state

కేసీఆర్ ఆరోగ్యంపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు: రాజగోపాల్​ రెడ్డి

Komati Reddy Rajagopal Reddy on KCR: సీఎం కేసీఆర్​ ఆరోగ్యంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​​ రెడ్డి అన్నారు. సింగరేణి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.

komati reddy raja gopal reddy
కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి
author img

By

Published : Mar 12, 2022, 3:54 PM IST

Komati Reddy Rajagopal Reddy on KCR: సింగరేణి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రోజగోపాల్​ రెడ్డి విమర్శించారు. సింగరేణిపై తెరాస నాయకుల మాటలు నిజం కాదని వెల్లడించారు. సింగరేణిని ప్రైవేటు పరం చేస్తున్న వార్తల్లో వాస్తవం లేదని.. ఏ ప్రభుత్వం కూడా ప్రైవేటు పరం చేయలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు అసెంబ్లీ పాయింట్​ వద్ద ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన టెండర్లలో గోల్​మాల్​ జరిగిందన్న రాజగోపాల్​ రెడ్డి.. ఆ విషయాన్ని నిరూపిస్తానని చెప్పారు. సింగరేణికి చెందిన నైనీ బ్లాకును ప్రైవేటు కంపెనీకి అప్పగించి.. సంస్థకు రూ. 20 వేల కోట్లు నష్టం వాటిల్లేలా తెరాస సర్కారు యత్నిస్తోందని ఆరోపించారు.

ప్రజలకు తెలుసు

తెలంగాణ సెంటిమెంట్​ను వాడుకొని తెరాస రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని రాజగోపాల్​ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. తనకు అన్ని అంశాలపై పట్టుందని సమాధానమిచ్చారు. జీవన్ రెడ్డి స్థాయి, రాజగోపాల్ రెడ్డి స్థాయి ఏంటో ప్రజలకు తెలుసన్నారు.

నేను ఆ ఉద్దేశంతో అనలేదు

కేసీఆర్ ఆరోగ్యంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి ఆస్పత్రికి వెళ్లినట్లు తనకు తర్వాత తెలిసిందని చెప్పారు. సభలో జగదీశ్​ రెడ్డి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. అనవసరంగా తమపై లేనిపోని విమర్శలు తగవని హెచ్చరించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఏంటో నల్గొండ ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు దోచుకుంది ఆంధ్రా కాంట్రాక్టర్లే- ఇప్పుడు దోచుకుంటుందని ఆంధ్రా వాళ్లే అని ఆక్షేపించారు.

ఇదీ చదవండి: KTR About Hyderabad Nalas : 'ఆ సమయంలో కేంద్రం పైసా ఇవ్వలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.