ఇవీ చూడండి:'పసుపు రైతుల బ్యాలెట్ పోరాటం'
'మధ్య దళారులతో రైతులకు ముప్పు' - bank fraud
పాలీహౌస్‌లు, పౌల్ట్రీ ఫాంల నిర్మాణాలకు సంబంధించి రుణాల మంజూరులో అక్రమాలను నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. తెజస అధ్యక్షుడు కోదండరాం వారికి మద్దతు పలికారు. అక్రమాలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
రైతులకు మద్దతు ఇచ్చిన కోదండరాం
హైదరాబాద్ బషీర్‌బాగ్ కెనరా బ్యాంకు సర్కిల్ ఆఫీసు వద్ద రైతులు ధర్నాకు దిగారు. రుణాల మంజూరు విషయంలో అక్రమాలనునిరసిస్తూ ఆందోళన చేపట్టారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం వీరికి మద్దతు పలికారు. వ్యవసాయ అనుబంధ శాఖల్లో మంజూరయ్యే రుణాల పంపిణీలో దళారుల ప్రమేయం ఉందని ఆయన ఆక్షేపించారు. రుణాల కింద రైతులకు ఇచ్చిన పాలీహౌస్‌లు ఉపయోగపడకపోగా... అప్పులు మిగిల్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:'పసుపు రైతుల బ్యాలెట్ పోరాటం'