కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చిలకలగూడలోని కట్టమైసమ్మ ఆలయాన్ని సందర్శించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పాడి పంటలు సమృద్ధిగా పండి పచ్చదనంతో దేశం వెలుగొందాలని పేర్కొన్నారు. ఆలయ ఈవో కృష్ణ, స్థానిక కార్పొరేటర్ హేమ పూర్ణకుంభంతో కిషన్‌రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు ఘనంగా సన్మానించారు.
ఇదీ చూడండి : బోనాల జాతరను సందర్శించిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్